ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - May 08, 2020 , 06:35:59

మెదక్‌ జిల్లాలో భారీ వర్షం

మెదక్‌ జిల్లాలో భారీ వర్షం

మెదక్‌, నమస్తే తెలంగాణ /కొల్చారం/ చిలిపిచేడ్‌/ పాపన్నపేట/ రామాయంపేట/నిజాంపేట: మెదక్‌ జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొల్చారం, చిలిపిచేడ్‌, పాపన్నపేట, మెదక్‌ రూరల్‌ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. మంబోజిపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి వర్షం నీరు చేరింది. ఖాజీపల్లిలోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. చిన్నఘనాపూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌, కొడుపాక గ్రామాల్లో వడగండ్ల వానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. చిత్రియాల గ్రామంలో వర్షానికి వేపచెట్టు నేలకొరగడంతోపాటు రేకుల ఇల్లు కూలిపోయింది. రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అక్కన్నపేట, డి.ధర్మారం, లక్ష్మాపూర్‌, తొనిగండ్ల, కోనాపూర్‌, కాట్రియాల గ్రామాల్లో వడగండ్ల వాన పడింది. దీంతో గ్రామాల్లోని కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నిజాంపేట మండలంతోపాటు కల్వకుంట, నార్లపూర్‌, బచ్చురాజ్‌పల్లి, జెడ్చెరువు తండా, రజాక్‌పల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 


logo