మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 08, 2020 , 06:36:00

ఆపత్కాలంలో దాతల సాయం

ఆపత్కాలంలో దాతల సాయం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు, వలస కూలీల ఆకలి తీర్చేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. గురువారం ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా దాతలు తమకు తోచిన రీతిలో సరుకులు అందజేస్తూ  పేదలకు అండగా నిలుస్తున్నారు.

 • రామచంద్రాపురం: ఆర్సీపురం డివిజన్‌ రామచంద్రారెడ్డినగర్‌లో ఆటో డ్రైవర్లకు పీఎన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పానగేశ్‌ దంపతులు సరుకులు పంపిణీ చేశారు.
 • గుమ్మడిదల: గుమ్మడిదలలో పారిశుధ్యకార్మికులు, ఆశవర్కర్లకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు, మండల అధ్యక్షురాలు అమరేశ్వరి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.  
 • అమీన్‌పూర్‌: అమీన్‌పూర్‌లో హిజ్రాలకు కాంగ్రెస్‌ నాయకుడు మహేశ్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌ సుధారాణి సరుకులు పంపిణీ చేశారు. 
 • మెదక్‌, నమస్తే తెలంగాణ:  మెదక్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  
 • మద్దూరు: మండలంలోని కూటిగల్‌లో ఆశకార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, వలస కూలీలకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్‌రావు నిత్యావసర సరుకులను అందజేశారు. 
 • పాపన్నపేట: మండల కేంద్రం జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, సిబ్బంది పారిశుధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు.  
 • హత్నూర: మండలంలో పల్పనూర్‌లో వలస కార్మికులకు ఏఐఎస్‌ఎస్‌డీ సభ్యులు నగేశ్‌, పద్మారావు, మనోహర్‌, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ నిత్యావసర సరుకులు అందజేశారు.
 • తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నారాయణగుప్తా, వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సీఐ స్వామిగౌడ్‌, ఎస్సై సుభాశ్‌ ఇంటింటికీ వెళ్లి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • బొల్లారం: మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌లో కౌన్సిలర్లు చంద్రారెడ్డి, చంద్రయ్య ఆధ్వర్యంలో ఆశవర్కర్లకు సరుకులు అందజేశారు.
 • కొండపాక: మండలంలోని ఆటో డ్రైవర్లు, టోల్‌ ప్లాజా సిబ్బందికి టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి నూనెకుమార్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి పంపిణీ చేశారు.  
 • కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: సిద్దిపేటలో నిరుపేదలకు కౌన్సిలర్‌ మల్లికార్జున్‌ నిత్యావసర సరుకులను అందజేశారు.
 • జిన్నారం: మండలంలోని జంగంపేటలో పేదలకు జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, సర్పంచ్‌ వెంకటయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: పటాన్‌చెరు పట్టణంలో ఎండీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సరుకులు అందించారు.  
 • చిన్నశంకరంపేట: మండలంలోని భాగిర్థిపల్లిలో పేదలకు దక్కన్‌ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం, యాక్సీ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సర్పంచ్‌ దయానంద్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌లు లక్ష్మణ్‌, నాగరాజు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
 • చిలిపిచెడ్‌: మండలంలోని శీలాంపల్లిలో 13క్వింటాళ్ల బియ్యాన్ని సర్పంచ్‌, ఎంపీపీ  తాసిల్దార్‌ అబ్దుల్‌సత్తార్‌కు అందజేశారు.


logo