బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - May 03, 2020 , 02:28:16

పేదలకు అండగా..

పేదలకు అండగా..

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అండగా నిలుస్తున్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో శనివారం నియోజకవర్గంలోని 237 నిరుపేద కుటుంబాలకు మంత్రి నిత్యావసర సరుకుల కిట్స్‌  అందజేశారు. ఇబ్రహీంనగర్‌, రామంచ, నాంచారుపల్లి, రాఘవాపూర్‌, చంద్లాపూర్‌, రామచంద్రానగర్‌, మందపల్లి  తదితర గ్రామాల వాసులకు వీటిని అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. అంతకుముందు దూది మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు సమక్షంలో 140 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్‌ అందజేశారు.  అనంతరం సిద్దిపేట ఫొటో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ తరఫున రూ.11 వేలను సీఎం సహాయనిధి కోసం మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. సిద్దిపేటకు చెందిన నక్షత్ర గ్రూపు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త సుధాకర్‌రావు ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్క్‌లను మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌, వన్‌టౌన్‌ సీఐ సైదులుకు అందజేశారు.  కరోనా నేపథ్యంలో పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి కొనియాడారు. logo