గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 30, 2020 , 03:11:27

కరోనా నిర్మూలనకు మాస్క్‌లు తప్పనిసరి

కరోనా నిర్మూలనకు మాస్క్‌లు తప్పనిసరి

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం మాస్క్‌లు తప్పనిసరి చేయడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాస్క్‌లను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. పుల్కల్‌లోని గొంగ్లూర్‌లో మహిళా సంఘాల కార్యకర్తలు తాము కుట్టిన  మాస్క్‌లను ఉపాధిహామీ కూలీలకు, చిన్నశంకరంపేట దర్పిల్లిలో ఎంపీడీవో లక్ష్మణమూర్తి, రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పారిశుధ్య కార్మికులకు, నర్సాపూర్‌లోని పలు బ్యాంకు ఉద్యోగులకు మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, పాపన్నపేటలోని కొత్తలింగాయపల్లిలో సర్పంచ్‌ నవీన్‌గౌడ్‌ మాస్క్‌లను ఉపాధిహామీ కూలీలకు, టేక్మాల్‌లోని ఎల్లంపల్లి శివారులో జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్‌ ఉపాధి హామీ కూలీలకు, తూప్రాన్‌లో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సోహాల్‌ ఆధ్వర్యంలో నర్సాపూర్‌, శివ్వంపేట ప్రాంతాల నుంచి తూప్రాన్‌కు వస్తున్న వలస కార్మికులు, నిరుపేదలకు, తూప్రాన్‌లోని పలు గ్రామాల్లో  ప్రజాప్రతినిధులు ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు, మొగుడంపల్లిలో మాన్నాపూర్‌  సర్పంచ్‌ ఈశ్వర్‌రెడ్డి కూలీలకు, ప్రజాహిత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాయపోల్‌లో 300 మంది కూలీలకు మాస్క్‌లు పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్య సంఘం తరఫున అందించిన 3వేల మాస్క్‌లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితావెంకట్‌ వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి మాస్క్‌లను కుట్టించి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో 2 వేల వరకు ఉచితంగా అందించి సిద్దిపేట సత్యసాయి సేవా సమితి సభ్యులు సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.  సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ

రామచంద్రాపురం: భారతీనగర్‌ డివిజన్‌లోని ఎల్‌ఐజీలో, ఆర్సీపురంలో బల్దియా ఉప కమిషనర్‌ బాలయ్య నేతృత్వంలో బుధవారం సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ రసాయన మందును పిచికారీ చేశారు.


logo