గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Apr 28, 2020 , 02:32:40

నిరాడంబరంగా గులాబీ పండుగ

నిరాడంబరంగా గులాబీ పండుగ

 • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు 
 • పార్టీ ఆఫీసులు, ఇండ్లపై జెండావిష్కరణలు 
 • తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు 
 • జోరుగా కార్యకర్తల రక్తదానాలు,  పండ్ల పంపిణీ 
 • కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
 • రాష్ట్ర సాధన తరహాలోనే కరోనాను కట్టడి చేద్దాం.. 
 • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కేపీఆర్‌ పిలుపు  

ఉమ్మడి మెదక్‌జిల్లా నెట్‌వర్క్‌: ‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, రక్తంబొట్టు చిందకుండా తెలంగాణ రాష్ర్టా న్ని సాధించిన ఘనత ముమ్మాటికి సీఎం కేసీఆర్‌దే. చా వును సైతం లెక్కచేయకుండా కేసీఆర్‌ చేపట్టిన ఆమరణదీక్షతో కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది. అలుపెరగని ఉద్యమాలు..కార్యకర్తలు, ఉద్యమకారుల వీరోచిత పోరాటం, అమరుల త్యాగాలతోనే తెలంగాణ కల సాకారమైంది’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సోమవారం ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత సూచన మేరకు నిరాడంబరంగా కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో గులాబీ జెండా ఆవిష్కరణతోపాటు నర్సాపూర్‌ పట్టణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు. మెదక్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. 14ఏండ్ల పోరాటం, త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని, రక్తం చిందకుండా కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌ అన్నారు. ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఫలితా లు తెలంగాణ ప్రజలకు అందుతున్నా యన్నారు. మంత్రి పదవులతోపాటు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ పదవులకు ఎన్నోసార్లు రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. లాఠీలు, తూటాలకు వెరవకుండా ఎన్నో ఉద్యమాలకు ప్రజ లే కథా నాయకులై ముందుకు నడిచిన స్ఫూర్తి మరువలేనిదన్నారు. 2001 ఏప్రిల్‌ 27 నుంచి రంగనాయకసాగర్‌ జలదృశ్యం ఆవిష్కరణ దాకా మంత్రి వివరించారు. ఉద్యమ సాధనకు కలిసికట్టుగా ఉద్యమించిన తరహాలోనే కరోనా వైరస్‌ నిర్మూలనకు పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 • దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. 
 • హైదరాబాద్‌లోని తన నివాసంలో జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ర్టానికి టీఆర్‌ఎస్‌యే శ్రీ రామరక్ష అన్నారు. రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ  నేతే ముఖ్యమంత్రి కావడంతో ప్రజలకు అన్నివిధాలుగా మేలు జరుగుతున్నదని స్పష్టం చేశారు.  
 • అందోలు నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అందోలు-జోగిపేట మున్సిపాలిటీ జోగినాథ్‌ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ జెండాను ఎగురవేశారు.  
 • హుస్నాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ గులాబీజెండాను ఆవిష్కరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో రూ.4200 కోట్ల అభివృద్ధి జరిగిందని, గౌరవెల్లి ప్రాజెక్టు 95శాతం పూర్తయిందన్నారు.  
 • నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. నారాయణఖేడ్‌ ఎంబీఆర్‌ చౌక్‌ వద్ద ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  
 • నర్సాపూర్‌ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి సునీతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 • జహీరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాణిక్‌రావు జెండా ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, డీసీఎం ఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, పార్టీ నాయకులు ఉన్నారు.   
 • పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ వే డుకలు ఘనంగా జరిగాయి. పటాన్‌చెరులో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గులాబీ జెండా ఆవిష్కరించారు. దేశంలో కరోనా సంక్షోభం ఉన్నదని, రా ష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్య లు తీసుకుంటున్నదన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
 • సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో  జరి గిన వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిరాం పాల్గొన్నారు. అలాగే, సిద్దిపేటతో పాటు నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్‌, సిద్దిపేట అర్బన్‌, నారాయణరావుపేట మండలాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి టీఆర్‌ఎస్వీ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
 • గజ్వేల్‌లో ముఖ్యనాయకులంతా కార్యకర్తలతో కలి సి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించారు. ఇందులో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మ న్‌ పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు.
 • చేర్యాల పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో జెండా లు ఆవిష్కరించారు.గజ్వేల్‌ మండలంలోని సింగాటంలో మండలాధ్య క్షుడు మధు జెండాను ఆవిష్కరించారు. 
 • కొండపాకలో జరిగిన వేడుకల్లో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ అశ్విని, సర్పం చ్‌ మాధురి, తెలంగాణ జాగృతి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్‌ పాల్గొన్నారు. 
 • జగదేవపూర్‌లో మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్‌, గ్రామాధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో జెండావిష్కరించి, శ్రేణులు వారి ఇండ్లపై జెండాలు ఎగురవేశారు. 
 • మిరుదొడ్డి మండలంలోని పలుగ్రామాల్లో శ్రేణులు వేడుకలు జరుపుకోగా, మిరుదొడ్డిలో మండలాధ్య క్షుడు వెంకట్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట ఏరియా దవాఖానలో 15మంది నేతలు రక్తదానం చేశారు. 
 • కోహెడలోని పార్టీ కార్యాలయంలో మండలాధ్య క్షుడు జెండాను ఆవిష్కరించారు. గ్రామాల్లో ఎవరి ఇండ్లపై వారు జెండాలు ఎగురవేసి అభిమానాన్ని చాటుకున్నారు.
 • కొమురవెల్లిలో మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
 • బెజ్జంకి మండల కేంద్రంలో రావుల రామకృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించగా, క్రాసింగ్‌ వద్ద ఉన్న కృపా భవన్‌లోని అనాథపిల్లలకు అన్నదానం, పా లు, బ్రెడ్‌ అందజేశారు. తిమ్మాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి ఆధ్వర్యంలో  రక్తదాన శిబిరం నిర్వహించారు. 
 • దౌల్తాబాద్‌లో పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి ఆధ్వ ర్యంలో వేడుకలు జరిపారు. సామాజిక దూరం పాటిస్తూ నిరాడంబరంగా జరుపుకున్నారు.
 • అక్కన్నపేటలో మండలాధ్యక్షుడు మ్యాక నారాయణ జెండాను ఎగురవేశారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంచారు. 
 • మద్దూరు మండలం నర్సాయపల్లిలో ఎంపీపీ కృష్ణారెడ్డి తన ఇంటిపై, అలాగే, అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు తమ ఇండ్లపై జెండాలు ఎగురవేశారు.
 • సంగారెడ్డిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి మాజీ ఎమ్మల్యే చింతా ప్రభాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 • రాయికోడ్‌లోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద మండలాధ్యక్షుడు బస్వరాజుపాటిల్‌ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు.
 • మునిపల్లి మండలం తాటిపల్లిలో మండల మాజీ అధ్యక్షుడు నవాజ్‌రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగుర వేసి, సంబురాలు జరుపుకున్నారు.
 • గుమ్మడిదల మండల కేంద్రంతోపాటు బొంతప ల్లి, దోమడుగు, అన్నారం, కానుకుంట, కొత్తపల్లి, నల్లవల్లి, మంభాపూర్‌ తదితర గ్రామాల్లో పార్టీ జెం డాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. 
 • హత్నూరతో పాటు దౌల్తాబాద్‌, పల్పనూర్‌ గ్రామా ల్లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు జరుపుకున్నారు. 
 • బొల్లారంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొలన్‌ రోజా బాల్‌రెడ్డి దంపతులు తమ ఇంటిపై గులాబీ జెండా ను ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు.
 • కొండాపూర్‌లో టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. 
 • వట్‌పల్లి మండలం పోతులబొగుడలో రాష్ట్ర నాయకుడు రాహుల్‌కిరణ్‌, వట్‌పల్లి చౌరస్తాలో గోపాల్‌ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచారు.  
 • రామచంద్రాపురం చౌరస్తాలో కార్పొరేటర్లు అంజయ్యయాదవ్‌, సింధూఆదర్శ్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షు డు పరమేశ్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈదులనాగులపల్లి, రామచంద్రారెడ్డినగర్‌లో వైస్‌చైర్మన్‌ రాములుగౌడ్‌, కార్పొరేటర్‌ ఇండ్లపై జెండాను ఆవిష్కరించారు.
 • అమీన్‌పూర్‌ మండల, మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నా రు. ఎక్కడికక్కడ సామాజిక దూరం పాటిస్తూ జెండాలను ఎగురవేశారు. 
 • మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు గంగాధర్‌ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అశోక్‌, కౌన్సిలర్లు కృష్ణారెడ్డితో పాటు నాయకులు వారివారి ఇండ్లపై టీఆర్‌ఎస్‌ జెండాలు ఎగురవేశారు.
 • పెద్దశంకరంపేటలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండలాధ్యక్షుడు మురళీపంతులు జెండాను ఆవిష్కరించారు. కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంచారు.
 • రామాయంపేటలో మండలాధ్యక్షుడు, మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, సరాఫ్‌ యాదగిరి, యా దగిరి జెండాను ఆవిష్కరించారు. శ్రేణులు తమ ఇండ్లపై జెండాలు కట్టారు. 
 • నిజాంపేట మండలం నస్కల్‌లో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు తన ఇంటిపై జెండాను ఆవిష్కరించారు. 
 • తూప్రాన్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, యావాపూర్‌లో మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ఇస్లాంపూర్‌లో జడ్పీటీసీ రాణి, పలు గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు జెండాలు ఎగురవేశారు.
 • టేక్మాల్‌లో పార్టీ జెండాను మండలాధ్యక్షుడు వీరప్ప ఎగురవేసి, పండ్లు పంచారు. 
 • చేగుంటలోని గాంధీచౌరస్తా వద్ద మండలాధ్యక్షుడు వెంగళ్‌రావు ఆధ్వర్యంలో, నార్సింగిలో తౌర్యనా యక్‌ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పార్టీ జెండాను అవిష్కరించారు. అనంతరం దవాఖానలో పండ్లు పంచారు.
 • పాపన్నపేటలో మండలాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
 • మనోహరాబాద్‌తోపాటు కూచారంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌ గౌడ్‌ టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. చెట్లగౌరారంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి, పోతారంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి జెండాను ఎగురవేశారు. 
 • చిలిపిచెడ్‌, చండూర్‌, అజ్జమర్రి, జగ్గంపే ట, రాందాస్‌గూడ గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేశారు.


logo