శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 27, 2020 , 00:36:46

కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి

కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి

  • పారిశుధ్య కార్మికులతోనే సాధ్యం
  • పూర్తిగా కోలుకున్న కరోనా బాధితులు
  • 200 మెట్రిక్‌ టన్నుల బియ్యం బాధితుల సహాయానికి
  • బసవేశ్వరుడి సేవలు మరవలేనివి
  • ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • సంగారెడ్డి జిల్లాలో మంత్రి పర్యటన

సంగారెడ్డి అర్బన్‌/జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జిల్లాలో న మోదైన కేసులు పూర్తిగా నయమై, బాధితులు ఇంటికి చేరుకోవడంతో కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి నిలిచిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి, సదాశివపేట, పోతిరెడ్డిపల్లిలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పారిశుధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బైపాస్‌రోడ్డులోని బసవేశ్వర విగ్రహానికి వీరశైవ లింగాయత్‌ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ దవాఖానకు చేరుకొని, కరోనా శాంపిల్‌ కలెక్షన్‌ బూత్‌ను ప్రారంభిం చి, ఐసోలేషన్‌ వార్డును సందర్శించి వైద్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి ప్రా రంభించారు. జహీరాబాద్‌లో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు పౌష్ఠికాహారం కిట్లను అందజేశారు. బసవేశ్వర జయంతి సందర్భంగా పేదలకు వస్తువులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమా ల్లో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్లతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడారు. మొదటగా బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుభా కాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డి కరోనా ఫ్రీ జిల్లాగా నిలువడానికి కలెక్టర్‌ హనుమంతరావు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, పారిశుధ్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో పని చేయిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో కరోనా వైరస్‌ ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 30మందిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ రాగా, వారిని క్వారంటైన్‌కు పంపించి వైద్య సేవలు అందించామన్నారు. ప్రస్తుతం వారందరూ కోలుకొని ఇంటికి చేరుకోవడంతో జిల్లాలో కేసులు లేకపోవడం కరోనా ఫ్రీ జిల్లాగా నిలువడం సంతోషకరమన్నారు. ప్రజలు మరో ఆరు నెలలు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, పార్లమెంట్‌ పరిధిలో బసవేశ్వరుడి విగ్రహాలు, సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ భరోసా ఇచ్చారు. కోహీర్‌ మండలంలోని పిచార్యాగడి సహకార సం ఘం చైర్మన్‌ అరవింద్‌రెడ్డి కరోనా నివారణకు రూ. లక్ష చెక్కును మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. 

200టన్నుల బియ్యం సేకరణ

జిల్లాలో రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు ఉచితంగా ఒకరికి 12కిలోల చొప్పున ఎంతమంది ఉన్న అంత మందికి బి య్యం పంపిణీతో పాటు రూ.1500 నగదును ఖాతాల్లో జమచేశామన్నారు. ఈ నెల కూడా బియ్యంతో పాటు నగదును ప్రభుత్వం జమచేస్తుందన్నారు. ఇప్పటికే 12 కిలోల బియ్యం చొప్పున తీసుకున్న ప్రజలు కరోనా నివారణకు తిరిగి ఇచ్చేయడంతో జిల్లాలో 200టన్నుల బియ్యం సేకరణ అయ్యిందని కలెక్టర్‌ తనతో వివరించారన్నారు. ఇప్పటికే హరేరామ హరేకృష్ణ ట్రస్టు సహకారంతో పేదలకు భోజనాలు పెడుతున్నారన్నారు.

రక్తదానం చేయాలి..

బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని ఆ సంఘం తరఫున  రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వందమందికి పైగా దాతలు రక్తదానం చేయడం సంతోషకరమన్నా రు. నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువకులు, కార్యకర్తలు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రూ.1.96కోట్ల ‘ఉపాధి’ నిధులు విడుదల

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లాలో ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రూ.1.96 కోట్లు నిధులు విడుదలైనట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ నిధులు పోస్టాఫీసులో ఉన్నాయని, బయోమెట్రిక్‌ పద్ధతిలో చెల్లించాల్సిఉండగా, కరోనా నేపథ్యంలో చెల్లింపులు నిలిపివేశారని చెప్పారు. సోమవారం నుంచి జిల్లాలో అన్ని పోస్టాఫీసుల్లో చెల్లింపులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


చిట్టి చేతులు.. పెద్ద మనసు

సంగారెడ్డికి చెందిన శ్రీజ్యోతిర్వాసు విద్యాపీఠం మేనేజర్‌ సాయినాథ్‌-స్వాతి దంపతులు కూతురు శ్రీముఖి తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.3,826ను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావుకు అందజేసింది. వాటిని కరోనా బాధితులకు ఖర్చు చేయాలని కోరింది. చిన్నారి శ్రీముఖిని మంత్రి అభినందిస్తూ ‘స్టే హోం - స్టే సేఫ్‌' స్టికర్‌ను అందజేశారు.


logo