మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 25, 2020 , 03:14:31

లాక్‌డౌన్‌పై పాస్టర్లు అవగాహన కల్పించాలి

లాక్‌డౌన్‌పై పాస్టర్లు అవగాహన కల్పించాలి

  • ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ/రామచంద్రాపురం/అమీన్‌పూర్‌: పాస్టర్లు లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు పట్టణంలోని జీఎమ్మార్‌ కన్వెన్షన్‌హాల్‌లో  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 254మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులు, మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ   ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. అలాగే, ఆర్సీపురంలో పీఎన్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలు పుష్పానగేశ్‌ ఆధ్వర్యంలో బల్దియా పారిశుధ్య కార్మికులకు, అమీన్‌పూర్‌ మున్సిపల్‌లోని పీజేఆర్‌ కాలనీ, మాధవపురి హిల్స్‌ కాలనీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. 


logo