శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 24, 2020 , 02:19:40

ఇంటి వద్దే నమాజ్‌

ఇంటి వద్దే నమాజ్‌

జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, చేర్యాల, నమస్తే తెలంగాణ / మద్దూరు : లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ పవిత్ర మాసంలో ముస్లింలు తమ ఇంటి వద్దే నమాజ్‌ చేసుకోవాలని డీఎస్పీ గణపత్‌ జాదవ్‌ తెలిపారు. గురువారం జహీరాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నారాయణఖేడ్‌ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ సందీప్‌తో కలిసి డీఎస్పీ సత్యనారాయణరాజు ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు మద్దూరు మండల కేంద్రంలోని ముస్లింలతో హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ సమావేశమయ్యారు. చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ మహేందర్‌ మండల స్థాయి మసీదు కమిటీ ఇమామ్‌, మౌజన్‌లతో సమావేశం నిర్వహించారు. మసీదుల్లో కేవలం ఇమామ్‌లు మాత్రమే నమాజ్‌ చేసుకోవాలని వారు సూచించారు.  


logo