మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 24, 2020 , 02:18:20

ఆకలి తీరుస్తున్న దాతలు

ఆకలి తీరుస్తున్న దాతలు

హుస్నాబాద్‌/మెదక్‌/ సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ/తూప్రాన్‌ రూరల్‌/చేగుంట: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పేదలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు అన్నదానాలు చేసి ఆకలి తీరుస్తున్నారు. గురువారం హుస్నాబాద్‌ కెనరా బ్యాంకు అధికారులు భార్గవాపురం సేవా సమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. తూప్రాన్‌ శివారులోని 44వ జాతీయ రహదారిపై బాటసారులకు ఏకే అగర్వాల్‌ గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ సహకారంతో జీఎమ్మార్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌, రక్షా సెక్యూరిటీ సర్వీసెస్‌ ఇన్‌చార్జి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి షిర్డీ సాయిబాబా దేవాలయంలో రామాయంపేట ఉప తాసిల్దార్‌ సత్యం పంతులు, మెదక్‌లోని వైష్ణవి రెస్టారెంట్‌ యాజమాన్యం మల్లికార్జున లింగమూర్తి,  పరుశురాం,  వెంకటనారాయణ ప్రభుత్వ దవాఖాన వద్ద భోజన ప్యాకెట్లను అందజేశారు. సంగారెడ్డిలో కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ఆధ్వర్యంలో, సదాశివపేట పట్టణంలో అక్షయపాత్ర వారు, దళిత వాడ అంబేద్కర్‌ భవన్‌ ఎదుట మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.   


logo