ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 20, 2020 , 01:10:47

అద్భుత నిర్మాణం కాళేశ్వరం

అద్భుత నిర్మాణం కాళేశ్వరం

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ వరప్రదాయి ని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మానవ అద్భుతమని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొండపోచమ్మ రిజర్వాయర్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుందని, ప్రతి ఎకరాకు సాగునీరందుతుందన్నారు.సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని వ్యవసాయ పరంగా ఉన్నత స్థానంలో నిలుపుతున్నారని, రైతుకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. 

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

గజ్వేల్‌ అర్బన్‌: స్వీయ నియంత్రణ పాటించడమే కరోనా వ్యాప్తి జరుగకుండా ఉండడానికి శ్రీరామరక్షగా పని చేస్తుందని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. కరోనా నేపథ్యంలో గజ్వేల్‌లో రక్షణ చర్యలను సంపూర్ణంగా పాటిస్తున్నట్లు తెలిపారు. 


logo