శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 20, 2020 , 01:10:22

జోరుగా సరుకుల పంపిణీ

జోరుగా సరుకుల పంపిణీ

చేర్యాల, నమస్తే తెలంగాణ /కొమురవెల్లి / గజ్వేల్‌ జోన్‌ బృందం/ రాయపోల్‌/కోహెడ/సిద్దిపేట జోన్‌ నెట్‌ వర్క్‌: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఉల్లెంగల ఏకానందం ఆధ్వర్యంలో ఉల్ల్లెంగల ట్రస్టు ద్వారా మండలంలోని ఆకునూరులో ఆదివారం ఏసీపీ మహేందర్‌, ఎంపీపీ కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం చేతుల మీదుగా 600 పేద కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొమురవెల్లి మండలం రాంసాగర్‌లో సర్పంచ్‌ తాడూరి రవీందర్‌  ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేశారు. గజ్వేల్‌ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పేదలకు ఫ్రెండ్స్‌ ఫర్‌యూ  మిత్ర బృందం ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి సరుకులు అందజేశారు. గజ్వేల్‌ మండలంలోని దాచారం, బయ్యారం, ప్రజ్ఞాపూర్‌, పిడిచెడ్‌ గ్రామాల్లో మనం ఫౌండేషన్‌, కొండపాక మండలం దుద్దెడలో గ్రామ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. మర్కూక్‌ మండలం కర్కపట్లలో సర్పంచ్‌ నర్సింలు, జగదేవ్‌పూర్‌ మండలం మునిగడపలో పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో, రాయపోల్‌ మండల కేంద్రంలో పలువురు దాతలు, కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ గుండారెడ్డిపల్లిలో ఎంపీటీసీ కల్యాణి, సిద్దిపేటలో స్మార్ట్‌ వాకర్స్‌ ఆధ్వర్యంలో, 2002 పదో తరగతి విద్యార్థులు, నారాయణరావుపేట మండలం మాటిండ్లలో ఎన్నారై నవీన్‌కుమార్‌ స్థానిక పేదప్రజలకు బియ్యం పంపిణీ చేశారు.


logo