గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Apr 20, 2020 , 01:09:59

‘గోదావరి’ కల సాకారమైంది

‘గోదావరి’ కల సాకారమైంది

  • కరోనా లేకపోతే  నీళ్ల పండుగ జరుపుకునేవాళ్లం 
  • చిన్నకోడూరు, నారాయణరావు, సిద్దిపేట రూరల్‌ మండలాల్లోని చెరువులు నింపుతాం 
  • ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 
  • రంగనాయకసాగర్‌ ఎడమ కాల్వ వెంట 70 కి.మీ మేర క్షేత్రస్థాయి పర్యటన

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ/చిన్నకోడూరు/సిద్దిపేట రూరల్‌ : ‘తెలంగాణ తేవడానికి ఎంత కష్టపడ్డామో.. కఠోర శ్రమతో గోదావరి జలాలు తేవడానికి అంతే కష్టపడ్డాం.. కరోనా లేకపోతే జిల్లాలో కనీవినీ ఎరుగనిరీతిలో నీళ్ల పండుగ జరిపేవాళ్లం.. కేసీఆర్‌ సీఎం కావడంతోనే సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు వస్తున్నాయి.. ఇంత కంటే మధుర క్షణాలు నా జీవితంలో ఇంకొకటి లేవు’.. అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రంగనాయకసాగర్‌ ప్రధాన ఎడమ కాల్వ వెంట ఉదయం 6:30 నుంచి 11:30 గంటల వరకు సు మారు 6 గంటల పాటు 70 కిలోమీటర్లు క్షేత్రస్థాయి లో పరిశీలన చేస్తూ.. కాల్వ స్థితిగతులపై ఆరా తీస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లోనే రంగనాయకసాగర్‌ నుంచి లక్షా 10వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయన్నారు. 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్‌ నిర్మించామని తెలిపారు. మొదటి దశలో నియోజకవర్గంలోని చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్‌ మండలాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపుతామన్నారు. కాగా, రంగనాయకసాగర్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.5కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే, కాల్వల వెంట పొలాలు ఉన్న రైతులు నీళ్లు పారే విధంగా పిల్ల కాల్వలు తవ్వుకోవాలని రైతులకు సూచించారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్‌ మండలాల్లో ఆర్‌-1 నుంచి ఆర్‌-9 వరకు తొమ్మిది పిల్ల కాల్వలు ఉన్నాయని వివరిం చారు. దీంతో పాటు ఆర్‌-3 పరిధిలో చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌, మాచాపూర్‌, గంగాపూ ర్‌, విఠలాపూర్‌ గ్రామాల్లో మొత్తం 55వేల ఎకరాల కు సాగునీరందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీంతోపాటు చౌడారం, మేడిపల్లి, చర్లఅంకిరెడ్డిపల్లి, మైలారం గ్రామాల్లో 25చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపేలా 6 కి.మీ పొడవుతో ఉన్న ఎల్‌ఎస్‌ఎం-5 కాల్వలకు అవసరమయ్యే 18 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్‌ మండలాల్లోని 28 గ్రామాల్లో 138 చెరువులు, 39,838 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. మొదటి దశలో అన్నీ చెరువులు, కుంటలు నింపుతామని వివరించారు. చిన్నకోడూరు మండలంలోని 20 గ్రామాల్లో 105 చెరువులతోపాటు 27,925 ఎకరాల ఆయకట్టు, నారాయణరావుపేట మండలంలో 5 గ్రామాల్లో 30 చెరువులతోపాటు 10,563 ఎకరాల ఆయకట్టుకు, సిద్దిపేట రూరల్‌ మండలంలోని 3గ్రామాల్లో 3 చెరువులతో 1350 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందిస్తామన్నారు. మంత్రి వెంట సుడాచైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, డీఈ రవీందర్‌, ఏఈ ఖాజా, మెగా ప్రతినిధి ఉమామహేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సామాజిక దూరం పాటించాలి

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : మార్కెట్‌లో అమ్మకం, కొనుగోలుదారులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం సిద్దిపేటలోని సమీకృత వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ను తనిఖీ చేశా రు. కరోనా నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మార్కెట్‌లో ప్లాస్టిక్‌ కవర్లు వాడొద్దని దుకాణాదారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ మా ర్కెట్‌ను నిత్యం శుభ్రం చేయించాలని ఏఎంసీ చైర్మన్‌ సాయిరాంకు సూచించారు. అలాగే, సిద్దిపేటలోని తన నివాసంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కాగా, కరోనా నియంత్రణకు పోలీసులు చేస్తున్న కృషి, త్యాగాన్ని తెలిపేలా సవ్వడి మ్యూజిక్‌ సంస్థ రూపొందించిన సెల్యూట్‌ పోలీసన్న వీడియో పా టను ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత కన్న, గాయకుడు స్వామి, సంగీత దర్శకుడు నవీన్‌, కెమెరామెన్‌ శ్రీకాంత్‌, ఎడిటర్‌ వెంకట్‌, నిర్వాహకులు భిక్షపతి, కార్తీక్‌, గ్రాఫిక్స్‌ రాజును మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌,  సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు జావిద్‌, మోయిజ్‌,  నాయకులు లక్ష్మీరాజం, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.


logo