సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 20, 2020 , 01:09:06

అకాల బీభత్సం..

అకాల బీభత్సం..

  • కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నకు నష్టం
  • పిడుగుపాటుకు రైతు, కాడెడ్లు, పాడిబర్రె, ఎద్దు మృత్యువాత
  • నష్టపోయిన పంటలను పరిశీలించిన అధికారులు
  • తడిసిన ధాన్యం కొనేందుకు చర్యలు

హుస్నాబాద్‌/చేర్యాల, నమస్తే తెలంగాణ మిరుదొడ్డి/ అక్కన్నపేట/నంగునూరు/చిన్నకోడూరు/కోహెడ/దౌల్తాబాద్‌/దుబ్బాక టౌన్‌: అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృ ష్టించింది. రైతుకు నష్టాన్ని మిగిల్చింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం అకస్మాత్తుగా పెనుగాలులు, ఉరుము లు, మెరుపులతో ప్రారంభమైన వర్షంతో కల్లాల్లో ఆరబె ట్టిన పంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోగా, మొక్కజొన్న తడిసిపోయింది. హుస్నాబాద్‌ పట్టణంతో పాటు డివిజన్‌ లోని హుస్నాబాద్‌, అక్కన్నపే, కోహెడ, బెజ్జంకి మండలా ల్లో తెల్లవారు జామున 4.45 సమయంలో ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో మొదలైన వర్షం మోస్తరుగా కురిసింది. కోసి కుప్ప వేసుకున్న వరి, మక్కజొన్న పంట పెద్దగా నష్టం జరుగలేదు. ఇప్పటికీ కోయకుండా ఉన్న వరిపంట, మొక్కజొన్న పంటలకు అకాల వర్షం నష్టాన్ని తెచ్చిపెట్టింది. పలుచోట్ల వడగండ్లు పడినప్పటికీ నష్టం తీవ్రస్థాయిలో లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చు కున్నారు. కొనుగోలు కేంద్రాలు, నష్టపోయిన పంటలను హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆకుల రజిత, బెజ్జంకి సింగిల్‌విండో చైర్మన్‌ శరత్‌ రావు, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. మిరుదొడ్డి మండలంలోని ఆయా గ్రామాలు, అక్కన్నపేట మండలంలోని రేగొండ, గోవర్ధనగిరి, కట్కూర్‌, గండి పల్లి, ధర్మారం, మల్లంపల్లి,  రామవరం, కుందన్‌వాని పల్లి, అక్కన్నపేట తదితర గ్రామాల్లోని పీఏసీ ఎస్‌, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న మక్కల కొనుగోలు కేంద్రంలో మక్కలు తడిసిపోయాయి. పలు చోట్ల ధాన్యం కొట్టుకుపోగా, లోడింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు సైతం వర్షానికి ముద్దయ్యాయి. నంగునూరు మండలం సిద్ధన్నపేట, గట్లమల్యాల, అక్కెనపల్లి, చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్‌, కోహెడ మండలంలోని 25 గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరికోలు గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ ధ్వజ స్తంభం నేలకూలింది. దౌల్తాబాద్‌ మండల కేంద్రంతో పాటు కోనాయిపల్లి, ఉప్పరపల్లి, గాజులపల్లి తదితర  గ్రామాల్లోని ఐకేపీ కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. చేర్యాల మండలంలోని ఆకునూరు, దొమ్మాట, గుర్జకుంట తదితర గ్రామాల్లో ధాన్యం తడిసి పోయింది. ఆదివారం ఉదయం 5 నుంచి 7గంట లకు వర్షం భారీగా కురవడంతో వీధులన్నీ జలమయమ య్యా యి. దుబ్బాకతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాల వద్ద పంటపై రైతులు కవర్లతో కప్పినా, జోరుగా వర్షం పడటంతో ధాన్యం తడిసింది. 

పిడుగుపాటుతో రైతు మృతి

దుబ్బాక, నమస్తే తెలంగాణ : పిడుగుపాటుకు దు బ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన రైతు మట్ట బుచ్చి రెడ్డి(34) మృతి చెందాడు. ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద వడ్లు ఆరబోసేందుకు వెళ్లగా, పిడుగు పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దుబ్బాక దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య రేఖ, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే సోలి పేట రామలింగారెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుం టామని ఆయన హామీ ఇచ్చారు.  

కొన్న రోజే కాడెడ్లపై పిడుగు..

చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన రైతు కడారి నరేశ్‌ కాడెడ్లపై ఆదివారం వేకువజామున పిడు గుపాటుతో మృత్యువాత పడ్డాయి. కాగా, రైతు నరేశ్‌ మరో రైతు వద్ద కాడెడ్లను రూ.లక్షకు కొని, శనివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద కట్టేశాడు. కొన్న రోజునే పిడుగు పడి ఎద్దులు మృత్యువాత పడడంతో రైతు కుటుంబం రోదించిన తీరు పలువురిని కలిచివేసింది.

గుండారెడ్డిపల్లిలో బర్రె..

కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో పిడుగు పడి ముక్కెర ఐలయ్య అనే రైతుకు చెందిన పాడిబర్రె మృతి చెందింది. దీని విలువ 50 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఐలయ్య కోరుతున్నాడు.

విద్యుత్‌ తీగలు తెగి పడి ఎద్దు..

దౌల్తాబాద్‌ మండలం తిర్మలాపూర్‌లో గాలివానకు విద్యుత్‌ మెయిన్‌ లైన్‌ తీగలు తెగి ఎద్దుపై పడడంతో మల్లేశం అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ రూ.70వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. 


logo