బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 19, 2020 , 00:47:30

విజువల్‌ మాస్క్‌లు అందజేత

విజువల్‌ మాస్క్‌లు అందజేత

హుస్నాబాద్‌/చేర్యాల, నమస్తే తెలంగాణ/మద్దూరు /గజ్వేల్‌అర్బన్‌ : ఉచిత  విజువల్‌ మాస్క్‌లను  ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన అరుణశ్రీరామ్‌ చౌదరి శనివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. చేర్యాల మండలంలోని తాడూరులో స్వామి వివేకానంద విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్‌ఐ మోహన్‌బాబు చేతుల మీదుగా 1400 మందికి మాస్క్‌లు పంపిణీ చేశారు. అలాగే పెదరాజుపేటలో అంకిత గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ మహిళలకు మాస్క్‌లు పంపిణీ చేశారు. గజ్వేల్‌ పట్టణంలో  మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి అందజేసిన మాస్క్‌లను ఏసీపీ నారాయణ పంపిణీ చేశారు. మద్దూరు మండలంలోని రేబర్తిలో శ్రీరాం యూత్‌ ఆధ్వర్యంలో జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి  గ్రామస్తులకు మాస్క్‌లను అందజేశారు. 


logo