గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Apr 12, 2020 , 00:09:05

మహనీయుడు జ్యోతిరావుపూలే

మహనీయుడు జ్యోతిరావుపూలే

  • మహనీయుడు జ్యోతిరావుపూలే
  • మహాత్ముల ఆచరణలు పాటించాలి
  • పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
  • సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు
  • ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

మెదక్‌/సిద్దిపేట కలెక్టరేట్‌/దుబ్బాక, నమస్తే తెలంగాణ/సంగారెడ్డి టౌన్‌/తూప్రాన్‌ రూరల్‌/బెజ్జంకి/రామాయంపేట/నిజాంపేట: మహాత్ముల ఆచరణలను పాటించాలని, మహనీయుల ఆశయాలకు అనుగుణం గా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, వారి ఆశయాలను ముందు కు తీసుకెళ్లాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డిలోని జ్యోతిరావుపూలే విగ్రహానికి కలెక్టర్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింలు జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తిలో ఎంపీపీ మోతీబాయి నివాళులర్పించారు. ఝరాసంగం మండలం సంఘం(కె)లో మనవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దగోల నారాయణ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతిరావు పూలే  చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామచంద్రాపురంలో జ్యోతిరావుపూలే చిత్రపటానికి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ పుష్పనగేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఐలేశ్‌యాదవ్‌, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బలరాం, భెల్‌లోని ఓబీసీ కార్యాలయంలో వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌లో, మాదారం గ్రామంలో ఏఐఎస్‌ఎస్‌డీ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. సిద్దిపేట జడ్పీ కార్యాలయంలో జ్యోతిరావుపూలే చిత్రపటానికి జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ  పూలమాలు వేసి నివాళులర్పించారు. స్త్రీలకు విద్యను నేర్పించేందుకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద గల పూలే విగ్రహానికి పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించగా, మాలమహానాడు ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. సిద్దిపేట ఇందిరానగర్‌ 28వ వార్డు లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  గుర్రాలశ్రీనివాస్‌ పాల్గొన్నారు. దుబ్బాక తహసీల్దార్‌ కార్యాలయంలో జ్యోతిరావుపూలే చిత్రపటానికి తహసీల్దార్‌ రామచంద్రయ్య, సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. బెజ్జంకి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి ని వాళులర్పించారు. చేర్యాలలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే చిత్రపటానికి టీఎంఎం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుట్టి సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హుస్నాబాద్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత తన స్వగృహంలో, అంబేద్కర్‌ చౌరస్తాలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే జయంతి నిర్వహించారు. మిరుదొడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో జ్యోతిరావు పూలే జయంతిని దళిత సంఘాల నేతలు తమ ఇండ్లలోనే నిర్వహించారు. కోహెడ మండల పరిషత్‌ కార్యాలయంలో జ్యోతిరావుపూలే జయంతిని నిర్వహించారు. మద్దూరు మండలంలో పూలే జయంతిని పలువురు తమ ఇండ్ల వద్దనే జరుపుకున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. మెదక్‌ కేవల్‌ కిషన్‌ భవన్‌లో జ్యోతిరావు పూలే జయంతిని మెదక్‌ జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. రామాయంపేటలోని మెదక్‌ చౌరస్తాలో పురపాలిక చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, జ్యోతిబాపూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు అశ్విని జయంతి జరిగింది. రామాయంపేటలో జిల్లా బీసీ సం క్షేమ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారాం ఇంట్లోనే పూలే చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజాంపేటతో పాటు నస్కల్‌ గ్రామంలో జయం తి కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయంలో పూలే చిత్రపటానికి కమిషనర్‌ శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, పట్టణంలోని గోల్కొండ వీధి లో జరిగిన కార్యక్రమంలో ఎంఈఎఫ్‌ జాతీయ నాయకులు అన ంతరావు, చెదల్‌భాస్కర్‌, ఎంవైఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్‌, ప్రవీణ్‌కుమార్‌, రాజు పాల్గొన్నారు.


logo