బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 11, 2020 , 02:24:35

రెడ్‌ జోన్లలో జరభద్రం

రెడ్‌ జోన్లలో జరభద్రం

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 15 వార్డు నుంచి 24 వార్డు వరకు రెడ్‌ జోన్లుగా ప్రకటించామని జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో పోలీసు, మున్సిపల్‌, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ పరిధిలోని గడి బస్తీలో ఒక వ్యక్తి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుద్ధ్య పనులకు మూడు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి, నివేదిక ఇవ్వాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించామన్నారు. రెడ్‌జోన్‌ వార్డులోని ప్రజలు బయటకు రావద్దని, సమాచారమిస్తే నిత్యావసర వస్తువులు పంపిస్తామన్నారు. అనంతరం డీఎస్పీ గణపత్‌ జాదవ్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ముగిసే వరకు ప్రజలు ఎవరూ బయటకు రావదన్నారు. మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జహీరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి, జహీరాబాద్‌ డిప్యూటీ డీఎంఆండ్‌హెచ్‌వో శంకర్‌, వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo