ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 09, 2020 , 02:48:45

త్యాగధనులకు వందనం

త్యాగధనులకు వందనం

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్న త్యాగధనులకు రుణపడి ఉంటామని నిరుపేదలు  తెలుపుతున్నారు.బుధవారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రావణ్‌, అనిత దంపతులు ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో ఆటో డ్రైవర్లు, హమాలీ, పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్‌లో లైట్‌ మోటర్‌ వెహికల్‌, మెకానిక్‌, మ్యాజిక్‌ ఆటో అసోసియేషన్‌ సభ్యులకు నిత్యావసర సరుకులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, హాస్యనటుడు శివారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు అందజేశారు. సిద్దిపేటలోని 1వ వార్డులో కౌన్సిలర్‌ మల్లికార్జున్‌ చికెన్‌, గుడ్లు అందజేశారు. అక్కారంలో సీఐ ఆంజనేయులు వలస కూలీలకు, రాజగోపాల్‌పేటలో యువకులు, నారాయణరావుపేట మండలం మాటిండ్లలో నవీన్‌కుమార్‌ సహకారంతో ఎంపీపీ బాలకృష్ణ, సర్పంచ్‌ నారాయణ, గజ్వేల్‌ మండలం జాలిగామలో ఎంపీపీ అమరావతి, సర్పంచ్‌ శివయ్య, ఎంపీటీసీ రాజిరెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణగౌడ్‌, ఆర్‌ఐ శ్రీధర్‌రెడ్డి, కొండపాకలో డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, గజ్వేల్‌లో స్నేహ మిత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, ములుగు మండలం కొక్కొండలో సర్పంచ్‌ గణేశ్‌, కుకునూర్‌పల్లిలో సర్పంచ్‌ జయంతి ఆధ్వర్యంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి నిత్యావసర సరుకులు  అందజేశారు.  కొమురవెల్లి పంచాయతీ ఆధ్వర్యంలో, చేర్యాలలో జర్నలిస్టులకు ఏసీపీ మహేందర్‌, కొత్తపల్లి సతీశ్‌కుమార్‌, గజ్వేల్‌లోని జర్నలిస్ట్‌ కాలనీలో సీనియర్‌ జర్నలిస్టు కృపాకర్‌రెడ్డి సహకారంతో రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ వలస కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.  

మెదక్‌లో మల్లేశం భవన నిర్మాణ కార్మికులకు, రేగోడు మండలం ఇటిక్యాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌యాదవ్‌, రేగోడ్‌లో మాజీ ఎంపీటీసీ అనితారామాగౌడ్‌, తాసిల్దార్‌ సత్యనారాయణ, ఎంపీవో లచ్చాలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నర్సాపూర్‌ మండలం నారాయణపూర్‌లో సర్పంచ్‌ ఇష్రత్‌ ఫాతీమా ఆధ్వర్యంలో, చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో యూత్‌ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 

అమీన్‌పూర్‌లోఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, చైర్మన్‌ పాండురంగారెడ్డి,    పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ చౌరస్తాలో భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు ఆధ్వర్యంలో ఇస్నాపూర్‌ డివిజన్‌ కమిటీ డీఎస్పీ రాజేశ్వర్‌రావు, చిట్కుల్‌లో సర్పంచ్‌ మధు ముదిరాజ్‌, జిన్నారం మండలం వావిలాలలో ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ సుశాంతి, కల్హేర్‌లో వార్డు సభ్యురాలు పద్మవ్వ ఆధ్వర్యంలో ఆత్మకమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, జెడ్పీటీసీ నర్సింహారెడ్డిలు, నారాయణఖేడ్‌ మండలం బాణాపూర్‌లో సేవోద్గం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, నాగల్‌గిద్ద మండలం మోర్గీలో ఎంపీపీ మోతీబాయి రాథోడ్‌లు వలసకూలీలకు నిత్యావసర సరుకులు, నగదును అందజేశారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ సభ్యులు పోలీసులు, వైద్యుల కోసం సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి శీతలపానీయాలను అందజేశారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌కుమార్‌, వీఆర్వో రాజమల్లేశం, బొల్లారంలోని గాంధీనగర్‌లో కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, వరప్రసాద్‌రెడ్డి  కూరగాయలను పంపిణీ చేశారు. అందోల్‌లో అక్షయపాత్ర వారి సహకారంతో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, డాకూర్‌లో  వలస కూలీలకు జెడ్పీటీసీ రమేశ్‌, తాసిల్దార్‌ ప్రభు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డిలు తాసిల్దార్‌ కార్యాలయ సిబ్బంది తరఫున వీఆర్‌ఏ, మున్సిపల్‌ కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. 


logo