శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 09, 2020 , 02:49:45

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ/ సిర్గాపూర్‌/ పాపన్నపేట/నిజాంపేట/రామాయంపేట/టేక్మాల్‌: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం ఎమ్మెల్యే ఖేడ్‌ మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను, ధ్వంసమైన ఇండ్లను పరిశీలించారు.సిర్గాపూర్‌ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వాన బీభత్సానికి జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరగగా,   ఏఈవోలు పరిశీలించారు.  మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలో అకాల వర్షం వల్ల 170 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని  అధికారులు ప్రకటించారు. నిజాంపేటకు చెందిన బండారి కిషన్‌కు చెందిన బర్రె మంగళవారం రాత్రి పిడుగు పడి మృతి చెందింది. రామాయంపేటలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. రామాయంపేటలో 11.2 ఎంఎం వర్షపాతం నమోదైనట్టు తాసిల్దార్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు. టేక్మాల్‌ మండలం చంద్రుతండాకు చెందిన రామావత్‌ చాంగి ఇంటిపై రేకులు గాలివానకు ఎగిరిపడ్డాయి.  


logo