శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Apr 09, 2020 , 02:48:49

జై బజరంగ్‌ భళి

జై బజరంగ్‌ భళి

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్‌ జయంతి
  • కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని పూజలు
  • పాల్గొన్న ఎమ్మెల్యే , పలువురు నాయకులు

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : ఆంజనేయస్వామి ఆశీస్సులతో కరోనా మహమ్మారి శాశ్వతంగా పోవాలని బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చైతన్యనగర్‌లో గల హనుమాన్‌ ఆలయంలో పూజలు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా జోగిపేటలోని బజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో పోలీసులకు, మున్సిపల్‌ సిబ్బంది మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లికార్జున్‌గుప్తా, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్‌, జిల్లా బజరంగ్‌దళ్‌ ప్రముఖ్‌ చిరంజీవి, కరుణేశ్‌, పురం రఘు, సుమన్‌ భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. జిన్నారం  ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు.  చేగుంట, నార్సింగి, టేక్మాల్‌, హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో హనుమాన్‌ జయంతి కన్నుల పండువగా జరిగింది. మద్దూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు పానుగంటి తిరుపతయ్య ఆధ్వర్యంలో హనుమాన్‌ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. నారాయణఖేడ్‌ మండలం కొండాపూర్‌ హనుమాన్‌ మందిర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఆలయ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్‌ మహరాజ్‌ ఆశీస్సులు పొందారు. కొల్చారం, జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కోహీర్‌, ఝరాసంగం మండలాల్లో హనుమన్‌ జయంతిని భక్తులు  ఘనంగా నిర్వహించారు. మెదక్‌లోని పంచముఖి ఆలయంలో ఆంజనేయస్వామికి ఆలయం ధర్మకర్త మధుసూదనాచారి ఆధ్వర్యంలో, వర్గల్‌ నాచగిరి పుణ్యక్షేత్రంలోని రామాలయంలో ఆంజనేయస్వామికి అభిషేకాలు నిర్వహించారు. 


logo