బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 07, 2020 , 00:04:38

అంతటా అప్రమత్తం

అంతటా అప్రమత్తం

  • పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలపై అధికారుల నిఘా... మెదక్‌లో మరొక పేషెంట్‌కు నెగెటివ్‌... 

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కరోనా సోకిన వారికి గాంధీ దవాఖానలో మెరుగైన చికిత్స అంది స్తున్నారు. వారందరూ త్వరలోనే కోలుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏడు పాజిటివ్‌ కేసులున్న విషయం విదితమే. సంగారెడ్డి  వీరభద్రనగర్‌, ఉస్మాన్‌పుర కాలనీల్లో ఇద్దరికి, కలబ్‌గూర్‌ పంచాయతీ పరిధిలోని అంగడిపేటకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అలాగే జహీరాబాద్‌లోని బృందావన్‌ కాలనీ, కొండాపూర్‌, రామచంద్రాపురం లోని మయూరి నగర్‌ కాలనీలకు చెందిన ఒక్కొక్కరికీ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం ఏడు కేసులు నమోదు కాగా, ఆయా కాలనీలను ప్రత్యేక జోన్లుగా అధికారులు గుర్తించారు. ఆ కాలనీల్లో 100 మీటర్ల పరిధిలోని అన్ని గృహాల వారికి రోజువారీగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన ఏడుగురు వ్యక్తులకు సంబంధించి మొత్తం 64 మంది కుటుంబ సభ్యులను ప్రస్తుతం పటాన్‌చెరు సమీపంలోని పాటి నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. వీరికి ప్రతిరోజూ పరీక్షలు చేస్తు న్నారు.  అలాగే, ఈ ఏడుగురితో కలిసి తిరిగిన, మాట్లా డిన దాదాపు 170 మందిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఏడుగురు వ్యక్తులు నివాసం ఉండే 6 కాల నీల్లో దాదాపుగా 8వేల ఇండ్లు ప్రస్తుతం వైద్య సిబ్బంది ఆధీనంలో ఉన్నాయి. ఈ కాలనీలకు కొత్త వారిని రాని వ్వకుండా, కాలనీ వాళ్లను బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కాలనీ పరిసరాల్లో డ్రోన్లు, ఇతర వాహనాల ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్ర శేఖర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌లు పరిస్థి తిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు సోమవారం ఆర్సీపురంలోని మయూరీనగర్‌లో పర్యటించారు. కాలనీ వాసులు తగు జాగ్రత్తలు పాటించాలని, వైద్య సిబ్బందికి  సహకరించాలని కోరారు. మొత్తంగా జిల్లాలో ఇప్పటికే వచ్చిన ఏడుగురు వ్యక్తుల నుంచి ఇతరులకు కరోనా సోకకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు.  

మరో వ్యక్తికి నెగెటివ్‌..

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న మెదక్‌ వాసుల్లో మరో వ్యక్తికి నెగెటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఢిల్లీకి వెళ్లివచ్చిన మెదక్‌ వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అతడి కుటుంబ సభ్యుల్లోని ముగ్గురికి కరోనా సోకగా చికిత్సతో అందులో ఇద్దరి రిపోర్టులు ఆదివారం నెగెటివ్‌ రాగా, తాజాగా సోమవారం  మరోవ్యక్తి రిపోర్టు కూడా నెగెటివ్‌ వచ్చింది. వీరిని మల్లెపల్లిలోని క్వారంటైన్‌కు పంపినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలో 485 మందికి క్వారంటైన్‌ పూర్తి 

సిద్దిపేట కలెక్టరేట్‌:  జిల్లా వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన 458 మందికి ప్రభుత్వం విధించిన క్వారంటైన్‌ పూర్తయ్యింది. వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ మరో 14 రోజులు గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. సిద్దిపేట జిల్లాలో 26 మంది అనుమాని తుల శాంపిల్స్‌ టెస్టులకు పంపగా అందులో 25 మందికి నెగెటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయని, ఒకరికి మాత్రమే పాజిటివ్‌గా తేలిందని  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి కరోనా బారిన పడ్డ వ్యక్తితో సన్ని హిత సంబంధం కలిగిన 12 మంది రిపోర్ట్స్‌ ఆదివారం రాత్రి వచ్చాయని ఆ రిపోర్ట్స్‌ నెగెటివ్‌గా వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు.

ఐసోలేషన్‌లో వసతులపై మంత్రి ఆరా 

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ/రామచంద్రాపురం:   పటాన్‌చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని నారాయణ విద్యాసంస్థ భవనంలో ఉన్న ఐసోలేషన్‌ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు సోమవారం సందర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావులతో కలిసి  అక్కడ ఉన్నవారిని అడిగి వసతులపై ఆరాతీశారు. ఏ సమస్య ఉన్నా టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఆర్సీపురం డివిజన్‌లోని మయూరినగర్‌ కాలనీలో ఒకే ఇంటికి చెందిన తండ్రి, కొడుకుకి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించి అక్కడ చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

విస్తృత ప్రచారం 

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ/కోహెడ: సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య రథాన్ని సోమవారం హుస్నాబాద్‌, కోహెడ తదితర ప్రాంతాల్లో  తిప్పారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రసంగాల వీడియోలను ప్రజలకు వివరిం చారు. హుస్నాబాద్‌లోని సర్కారు దవాఖానలో సౌకర్యాల ను ఎప్పటికప్పుడు సమకూర్చుకోవడంతో పాటు కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు వైద్యు లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో జయ చంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన హుస్నా బాద్‌ సర్కారు దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. దుబ్బాక మున్సిపల్‌ చేర్వాపూర్‌ 6వ వార్డు కౌన్సిలర్‌ మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్‌రెడ్డి   తమ వార్డులో హోం క్వారంటైన్‌లో ఉన్న గృహాలను వైద్య సిబ్బందితో కలిసి  సందర్శించారు.  


logo