శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 06, 2020 , 02:27:03

కార్మికులు, కూలీలకు అన్నదానం

కార్మికులు, కూలీలకు అన్నదానం

సంగారెడ్డి అర్బన్‌, మెదక్‌, నమస్తే తెలంగాణ/అమీన్‌పూర్‌/చిన్నశంకరంపేట/రామాయంపేట/తూప్రాన్‌రూరల్‌: లాక్‌డౌన్‌  నేపథ్యంలో  కూలీలు, కార్మికులు, బాటసారులకు నిత్యం సంగారెడ్డిలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా కోర్టు ఆవరణలో అన్నదానం చేస్తున్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె స్వయంగా వడ్డించారు. అలాగే, సదాశివపేట మండలం ఆత్మకూరు బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వలస కార్మికులకు, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో రోగులు, కూలీలు, పారిశుధ్య కార్మికులకు ఆకలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అదేవిధంగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ, మండల పరిధిలో మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్‌చైర్మన్‌ నర్సింహాగౌడ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల అధ్వర్యంలో,  చిన్నశంకరంపేట మండలం చందంపేటలో హనుమాన్‌ సేవా సమితి ఆధ్వర్యంలో కార్మికులకు, అనాథలకు అన్నదానం చేశారు. మెదక్‌ ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 100 మందికి, రామాయంపేట మున్సిపాలిటీ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో, జాతీయ రహదారి వద్ద ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో, తూప్రాన్‌ పురపాలికలో వలస కార్మికులకు చైర్మన్‌ రాఘవేందర్‌ గౌడ్‌ అన్నం ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. 


logo