మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 06, 2020 , 02:23:37

పేదలకు అండగా..

పేదలకు అండగా..

ఉమ్మడి జిల్లా బృందం: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండ లం ఘనపూర్‌లో వలస కార్మికులకు  సర్పంచ్‌ కావ్య కాశిరెడ్డి, పంచాయతీ పాలకమండలి నిత్యావసరాలు అందజేశారు. హ త్నూరలో ప్రతి కుటుంబానికి మూడు కిలోల చొప్పున 3టన్ను ల కూరగాయలను టీఆర్‌ఎస్‌ నాయకులు శివశంకర్‌రావు, పెం టేశ్‌, యాదయ్య, కిష్టయ్య గ్రామస్తులకు పంపిణీ చేశారు. నారాయణఖేడ్‌లో స్థానిక వ్యాపారి వీరేశం సోదరులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు సేవాభారతి ఆధ్వర్యంలో  పేదలకు నిత్యావసర స రుకులు, కూరగాయలు అందజేశారు. సిర్గాపూర్‌లో సేవోద్గం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, సంగారెడ్డిలోని శాంతినగర్‌లో 27వ వార్డు కౌన్సిలర్‌ మంజులత నాగరాజుగౌడ్‌ తన సొంత డబ్బులతో నిత్యావసరాలు సమకూర్చగా, మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర భాకర్‌ పంపిణీ చేశారు. కంది పట్టణంలోని సోమేశ్వరవాడలో 3.5 కిలోల చొప్పున 60 మందికి సన్న బియ్యాన్ని స్థానిక కాం గ్రెస్‌ యువజన నాయకులు ఒగ్గు సతీశ్‌, కూన సంతోషల ఆధ్వర్యంలో అందజేశారు. కొండాపూర్‌ మండల పరిధిగుంతపల్లిలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పడమటి అనంతరెడ్డి, గొల్లపల్లిలో సొసైటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, మందాపూర్‌లో సర్పంచ్‌ కృష్ణవేణితో పాటు ఎంపీపీ మనోజ్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ శివలింగం గ్రామస్తులకు కూరగాయలను పంపిణీ చేశారు. న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌, న్యాల్‌కల్‌, గంగ్వార్‌ గ్రామాల్లో బీజేపీ నాయకులు మల్లేశం, ప్రభాకర్‌, రాజు, సుధాకర్‌, ప్రశాం త్‌, సురేశ్‌, జిన్నారంలోని గరీబ్‌షావళి దర్గా వద్ద కూరగాయలు, దవాఖానలో డిగ్రీ కళాశాల లెక్చరర్‌ నవీన్‌రెడ్డి పండ్లు అందజేశారు. గడ్డపోతారం పంచాయతీ అల్లీనగర్‌లో సిరి డెవలపర్స్‌, నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ ప్రకాశ్‌చారి, ఎంపీటీసీ జనాబాయి 200కుటుంబాలకు పది కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. గుమ్మడిదల మండలం దోమడుగులో రాజీరెడ్డి, రాఘవరెడ్డి కలిసి 50 మంది కూలీలకు, బొంతపల్లి పంచాయతీ వీరభద్రనగర్‌ కాలనీకి చెందిన ఓ కుటుంబానికి ఏఎన్‌ఎం అరుంధతి సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు అందించారు. బొల్లారంలో వలస కార్మికులకు వీవీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 16వ వార్డు కౌన్సిలర్‌ చంద్రారెడ్డి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. అందోల్‌లోని రాయికోడ్‌కు చెందిన గువ్వ వినయ్‌, గువ్వ భీమన్న, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కలిసి 10 క్వింటాళ్ల కూరగాయలు గ్రామస్తులకు అందించారు.  జోగిపేటలో 17వ వార్డులో కౌన్సిలర్‌ చిట్టిబాబు 250 కుటుంబాలకు ఐదు కిలోల చొప్పున సన్నబియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. వట్‌పల్లి మండల పరిధి పోతులబొగుడలో సర్పంచ్‌ నర్సమ్మ కూరగాయలు పంపిణీ చేశారు.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు 200మంది పారిశుధ్య కార్మికులు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, ధర్మవరం స్వప్న బ్రహ్మం, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశం, తెలంగాణ సేవక్‌ సంస్థ ఆధ్వర్యంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం   నిత్యావసర వస్తువులు, జ్యోతి స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు పాండు, తేల్జీర్‌ శ్రీనివాస్‌యాదవ్‌ బియ్యం పంపిణీ చేశారు. కేదారినాథ్‌ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు మధుసూదన్‌ కూలీలకు బియ్యం, నిత్యావసరాలు ఇచ్చారు. చేర్యాల మండలం ఆకునూరులో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, చేర్యాల పట్టణంలోని వలస కార్మికులకు రూ.50 వేల విలువైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. మిరుదొడ్డి మండలం మాదన్నపేట గ్రామస్తులకు ఎంపీపీ గజ్జెల సాయిలు, టీఆర్‌ఎస్‌ మండల సీనియర్‌ నేత పంజాల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చాట్లపల్లి బాలమల్లేశంగౌడ్‌ కూరగాయలు అందించారు. కోహెడ మండలం తంగళ్లపల్లి ఎంపీటీసీ కోనె శేఖర్‌ గ్రామంలోని సుమారు 700 కుటుంబాలకు కూరగాయలు, కోహెడ మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు 14మంది పారిశుధ్య కార్మికులకు 10 కిలోల చొప్పున బియ్యం, దౌల్తాబాద్‌ మండలం అహ్మద్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు అయ్యగారి నర్సింహులు, దౌలాబాద్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వెయ్యి కోడిగుడ్లు, గజ్వేల్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ పలువురికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌ సభ్యులు పలువురికి పండ్లు, బ్రెడ్లు అందించారు. తొగుట మండలం బండారుపల్లిలో క్వారంటైన్‌లో ఉన్న పలువురికి సర్పంచ్‌ శారద రఘోత్తంరెడ్డి నిత్యావసర సరుకులు అందించగా, కొండపాక మండలం బందారంలో ఎంపీపీ సుగుణ కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లిలో వలస కూలీలకు సర్పంచ్‌ కొమ్మురాజయ్య నేతృత్వంలో ఉప సర్పంచ్‌, ఏఈ సౌమ్య, డీలర్‌ ఎల్లారెడ్డి, పన్యాల రాజిరెడ్డి బృందం కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు.

మెదక్‌ జిల్లాలో..

మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలో పేద కుటుంబానికి కల్వకుంట పీఏసీఎస్‌ చైర్మన్‌ అందె కొండల్‌రెడ్డి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. రేగోడ్‌ మండలం మర్పల్లిలో 20గొల్ల,కుర్మల కుటుంబాలకు డెక్కన్‌, యక్షి కూడలి సంస్థ ఆధ్వర్యంలో, స్థానిక ఎస్‌ఐ కాశీనాథ్‌, సర్పంచ్‌ సిద్ధారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన షఫీతో పాటు ప్రవీణ్‌గౌడ్‌, మోహిన్‌, లడ్డు, మాఢాపూర్‌ రాజులు 10 కిలోల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేశారు. చిలిపిచెడ్‌ మండలంలోని చండూర్‌, చిలిపిచెడ్‌, జగ్గంపేట, బండపోతుగల్‌, ఫైజాబాద్‌ గ్రామాలకు చెందిన 15 నిరుపేద కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యం, 1 కేజీ కంది పప్పు, చెక్కర, నూనె ప్యాకెట్లను సమకూర్చగా, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, పైజాబాద్‌ గ్రామ సర్పంచ్‌ మనోహరరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. రామాయంపేట, తూప్రాన్‌ రూరల్‌, నిజాంపేట, చేగుంటతో పాటు తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్‌(పీటీ)లో ‘నీ నేస్తం’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వలస కార్మికులకు ఉచితంగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. నార్సింగి మండల కేంద్రంలోని పాస్టర్‌ సాల్మన్‌రాజు 160 మంది నిరుపేదలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశారు.


logo