సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 31, 2020 , 23:20:44

భారీగా మాస్కుల పంపిణీ

భారీగా మాస్కుల పంపిణీ

 రాయికోడ్‌/మనోహరాబాద్‌/రామాయంపేట/మెదక్‌, నమస్తే తెలంగాణ/గుమ్మడిదల: కరోనా విస్తరిస్తున్ననేపథ్యంలో పలుచోట్ల ఉచితంగామాస్కులు పంపిణీ చేశారు.   రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి మనోహరాబాద్‌లో కరోనాపై అవగాహన కల్పిస్తూ మాస్కులను అందజేయగా రామాయంపేటలో ప్రముఖ వ్యాపారి మెట్టు యాదగిరి పోలీసులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులకు బ్లౌజ్‌లను అందజేశారు. రాయికోడ్‌ మండల పరిధిలోని నాగ్వార్‌లో  సర్పంచ్‌ కళావతి  మంగళవారం 1000 మాస్కులను ఉచితంగా పంపిణీ చేశారు. మెదక్‌ మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి జిల్లా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌ ఉచితంగా మాస్కులు, శానిటైజర్లను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వో జాన్‌కృపాకర్‌, యూడీఆర్‌ఐ బట్టి రమేశ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అర్షద్‌అహ్మద్‌లు ఉన్నారు. గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం గ్రామ సర్పంచ్‌ దీపా గ్రామస్తులకు మాస్కులను పంపిణీ చేయగా మైత్రీఫౌండేషన్‌ చైర్మన్‌ ఉదయ్‌కుమార్‌, నరేశ్‌లు కలిసి గుమ్మడిదల పీహెచ్‌సీ డాక్టర్‌ యాకలక్ష్మికి వెయ్యి మాస్కులను అందజేశారు. మెదక్‌, జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులందరికీ కలెక్టర్‌ ధర్మారెడ్డి శానిటైజర్లను పంపిణీ చేశారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ కృష్ణమూర్తి,  మైనింగ్‌ ఏడీ జయరాజ్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, ఏపీడీలు ఉమాదేవి, బీమయ్యతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.


logo