బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 30, 2020 , 00:21:50

మెదక్‌ జిల్లాలో 10 మందికి కరోనా లక్షణాలు

మెదక్‌ జిల్లాలో 10 మందికి కరోనా లక్షణాలు

  • హుటాహుటిన గాంధీకి తరలింపు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్‌ జిల్లాలో కరోనా వైరస్‌ లక్షణాలు కలిగి ఉన్న 10 మందిని ఆదివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు . ఇందులో 9 మంది ఢిల్లీలోని ప్రార్థన మందిరానికి వెళ్లినట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగా క్వారంటైన్‌లో ఉన్న వీరిని పరిక్షల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండు అంబులెన్స్‌లలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాపన్నపేటకు చెందిన యువకునితో పాటు మెదక్‌కు చెందిన నలుగురు, శివ్వంపేటకు చెందిన ఒక్కరు, చేగుంటకు చెందిన ఒక్కరు, కొల్చారం చెందిన ఒక్కరు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.  


logo