శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 23, 2020 , 23:32:43

ఉమ్మడి జిల్లా ప్రజలకు నమస్తే..

ఉమ్మడి జిల్లా ప్రజలకు నమస్తే..

  • ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పాటిద్దాం
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: ‘కరోనాను నియంత్రించేందుకు స్వీయ నిర్బంధమే తప్ప మరో మార్గం లేదు. 24 గంటల జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ఉమ్మడి జిల్లా ప్రజలంందరికీ అభినందనలు. వైరస్‌ అడ్డుకునే క్రమంలో ఉమ్మడి జిల్లా దేశానికే ఆదర్శం కావాలి. ఈనెల 31 వరకు ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలి’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.  ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్లపై  గుమిగూడవద్దని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వచ్చే పదిరోజులు చాలా ముఖ్యం. మనమంతా కరోనా మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధం కావాలని, స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అన్నారు. కరోనాతో మనకేం కాదన్న నిర్లక్ష్యం వద్దని, వైరస్‌ విస్తరించిన తర్వాత బాధపడినా లాభం ఉండదన్నారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు.


logo