శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 22, 2020 , 23:41:40

కరోనాను ఖతం చేద్దాం

కరోనాను ఖతం చేద్దాం

మన ఇంట్లో మనముందాం.. కరోనాను ఖతం చేద్దామని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులతో గడిపారు. పోలీసులు, మిలటరీ వాళ్లు పెట్టిన దాని కన్నా మీరు స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏం కాదనే ధోరణి వద్దేవద్దు.. అలాంటి ధోరణితోనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం. మన కుటుంబం, మన రాష్ర్టాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం’.. అని పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు తన నివాసంలో బాల్కనీలోకి కుటుంబ సమేతంగా నిల్చుని చప్పట్లు కొట్టి మంత్రి హరీశ్‌రావు సంఘీభావం ప్రకటించారు.

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


logo