గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Mar 21, 2020 , 00:13:43

అమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

అమ్మ  దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

  • శతచండీయాగంతో అన్ని శుభాలే.. 
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు 
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • మర్పడగ ఆలయంలో పూజలు 

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ/ కొండపాక : యాగఫలం సిద్ధించాలి. అమ్మవారి దయతో దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి. యాగం పరిపూర్ణం కావాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కొండపాక మండలం మర్పడగలోని శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జునస్వామి ఆలయంలో శతచండీయాగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానందస్వామి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజల్లో శారీరక పరిశుభ్రత, ప్రశాంతతో పాటు మానసిక ప్రశాంతత అవసరమన్నారు. ఇలాంటి యాగాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యాగాలు చేయడంతో ఆరోగ్య ఫలం ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ అనేది విదేశాల నుంచి వచ్చిన వారికే ప్రమాదమని, ఇక్కడ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టిందన్నారు. శతచండీయాగం ఈ సమయంలో నిర్వహించడం శుభసూచకమన్నారు. చండీయాగంతో పాటు మహమ్మారి నివారణకు ప్రత్యేకంగా శీతల మంత్రంతో యాగం చేయడం కరోనా వైరస్‌ను అరికట్టేందుకు దేశంలో తొలిసారిగా మన దగ్గర నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతామన్నారు. 

మీ కార్యసిద్ధి ఫలించాలి.. 

ఇలాంటి సమయంలో యాగం నిర్వహిస్తుండడం అమ్మ అనుగ్రహమే అనుకోవాలని మాధవానంద స్వామి అన్నారు. కరోనా లాంటి మహమ్మారిని దైవానుగ్రహంతో పరిపూర్ణమవుతుందన్నారు. అందుకు శత చండీయాగంలో శీతల మంత్ర యజ్ఞం నిర్వహించామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యలు అభినందనీయమని వారి ప్రతినిధులుగా ఈ యాగంలో పాల్గొన్న మీకు అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయన్నారు. మీరు చేసే కార్యం సిద్ధించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలన్నారు. 

సాదాసీదాగా పూజలు.. 

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు చెప్పడమే కాకుండా మంత్రి హరీశ్‌రావు స్వయంగా పాటించారు. ఎక్కడికెళ్లినా నిత్యం జనాలతో రద్దీగా ఉంటుంది. కానీ శుక్రవారం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా గన్‌మెన్లను సైతం గుడిలోకి రావొద్దని, పరిమితమైన వారు మాత్రమే వెంబడి ఉండేలా జాగ్రత్తలు తీసుకొని సాదాసీదాగా గుడిలోకి వచ్చి పూజలు నిర్వహించారు. మనం పాటిస్తేనే ప్రజలు పాటిస్తారని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సందేశాన్నిచ్చారు. logo