శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 18, 2020 , 23:30:30

కరోనాపై అప్రమత్తం

కరోనాపై అప్రమత్తం

  • వైరస్‌ వ్యాప్తి కంటే జాగ్రత్తలే ప్రధానం 
  • జిల్లాలో సభలు, సమావేశాలు నిషేధం
  • శుభకార్యాలు కూడా నిర్వహించొద్దు
  • విదేశాల నుంచి వచ్చిన వారిచిరునామాలు తెలిసుండాలి
  • అధికారులకు కలెక్టర్‌ ఆదేశం 
  • వదంతులు నమ్మొద్దని ప్రజలకు హితవు 

వర్గల్‌: కరోనా మహమ్మారిపై ప్రజల్లో ఎలాంటి అలజడి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కలెక్టర్‌ పీ. వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం ఉదయం వర్గల్‌ తహసీల్దార్‌ కా ర్యాలయంలో గజ్వేల్‌, ముస్నాబాద్‌, సిద్దిపేట డివిజనల్‌ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితులో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అన్ని శాఖల అ ధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మూడు డివిజనల్‌ పరిధిలోని ఉన్నతస్థాయి అధికార బృందం తమ పరిధిలోని జన జీ వనం, వైద్య సేవలపై నిఘా పెట్టాలని సూచించా రు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి డి విజన్ల వారీగా ఆరోగ్య సమస్యలపై సమీక్షా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాధిపై వైద్యులు గోప్యత పాటించి, చికిత్స అందించాలన్నారు. చికిత్స కంటే నివారణ ముఖ్యమని తెలిపారు.

సభలు, సమావేశాలు రద్దు

కరోనా వ్యాధి నివారణపై ప్రభుత్వం తీసకుంటున్న ముందస్తు చర్యలను అందరూ కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చేపడుతున్న చర్యలను పౌరసమాజం స్వాగతించాలని కోరారు. తదుపరి ప్రకటన వరకు జిల్లాలో ఎక్కడా సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. శుభకార్యాలు సైతం వాయిదా వేసుకోవాలని సూచించారు. మూకుమ్మడి సమావేశాలు పెట్టొద్దని తెలిపారు.

ప్రయాణికుల అడ్రస్‌ తెలిసుండాలి

ప్రధానంగా జిల్లాలోని కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట మండలాలకు చెందిన వారు బతుకుదెరువు కోసం విదేశాల్లో ఉంటుంన్నందున వారు తమ సొంత ఊర్లకు  వచ్చిపోయే వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయి యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నందునా, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద నమోదైన వివరాలు ఆరోగ్యశాఖకు అనుసంధానం చేయాలన్నారు. కరోనా వ్యాధి ప్రబలకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడూ పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలో చేరుతున్న రోగుల తాలూకు చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. ఉన్నతస్థాయి అధికారులకు సమాచారమందించాలన్నారు. వైద్య శాఖతో పాటు, పోలీస్‌, రెవెన్యూ, డివిజనల్‌స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆరిఫా బేగం, ఎంపీడీవో మ్యాకల భిక్షపతి, గౌరారం సీఐ కోటేశ్వర్‌రావు, ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.logo