గురువారం 04 జూన్ 2020
Siddipet - Mar 16, 2020 , 23:34:29

తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలు

తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలు
  • కరోనాపై వదంతులు వ్యాప్తి చేయొద్దు
  • సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు
  • వాట్సాప్‌ నెం.7901100100కు ఫిర్యాదు చేయండి
  • పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌

సిద్దిపేట టౌన్‌: కరోనా వ్యాప్తి, రోగులంటూ కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఇష్టారీతిన తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రచారం చేస్తే ఏడాది జై లు శిక్ష తప్పదని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ హెచ్చరించారు. ఈ సందర్భం గా సోమవారం ఆయన మాట్లాడారు. సమాజంలో గందరగోళం సృష్టించే విధంగా పుకా ర్లు, ప్రచారం చేయడం చట్టరీత్యా తీవ్ర నేరమ ని, ఎవరికి తోచిన విధంగా వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా సంయమనం పాటించాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చ ర్యల గురించి ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చెప్పే విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, ఎవరికి వారు సొంత కథనాలు సృష్టించుకొని ప్రచారం చేయవద్దని సూచించారు. ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని, అధికారికంగా వైద్యాధికారులు చెప్పే అంశాలు, సూచనలను మాత్రమే ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. ప్రచారాల ద్వారా, సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా వచ్చే సమాచారాలను నమ్మవద్దన్నారు. ఎవరైనా సభ్యులు తప్పుడు పోస్టులను పెడితే, వెంటనే గ్రూపు నుంచి తొలగించాలని, గ్రూపు సభ్యులు తప్పుడు వార్తలు పోస్టు చేస్తే స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారమివ్వాలని తెలిపారు. లేదా సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ వాట్సాప్‌ నెం.7901100100, 100కు స మాచారమివ్వాలని సూచించారు. అలా చేయకపోతే అనంతరం చట్టపర చర్యలకు గ్రూపు అడ్మిన్లు బాధ్యులవుతారని తెలిపారు. వివాదాస్పద వ్యక్తులకు గ్రూపుల్లో చోటివ్వొద్దని, కరో నా వైరస్‌పై సోషల్‌ మీడియా వదంతులు న మ్మవద్దన్నారు. తప్పుడు ప్రచారం సమాజం లో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తుందని, ఇది ఏ మాత్రం మంచికాదన్నారు. కరోనాపై అవాస్తవ సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్‌డీఎంఏ యాక్టు సెక్షన్‌ 54 ప్రకారం కేసు నమోదు చేసి, జైలు శిక్ష, జరిమానా పడేలా చూస్తామన్నారు. 

సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త..

ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌ సాకు చూసుకొని సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలను వేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తారని, వీటిని నమ్మవద్దని సీపీ సూచించా రు. కరోనా వైరస్‌ సోకకుండా ఇవిగో మందులంటూ ప్రముఖ కంపెనీల నుంచి అబద్ధపు మెయిళ్లతో మేసేజ్‌ చేస్తారన్నారు. మెయిల్‌ ఏదైన ఫైల్‌ అటాచ్‌మెంట్‌ గానీ, మేసేజ్‌లోని నీలిరంగు లింకు ఉంటుందని, ఆ లింకును తెరిస్తే, బ్యాంకు ఖాతా ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ఇలాంటి మెయిల్స్‌, మేసేజ్‌లకు ప్రజలు ఎవరు స్పందించవద్దన్నారు. కరోనా వైరస్‌ గురించి అనధికార వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయని, సైబర్‌ నేరగాళ్లు మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారని తెలిపారు. ప్రజలందరూ సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.


logo