ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 15, 2020 , 23:06:20

పెరుగుతున్న ప్రవాహం

పెరుగుతున్న ప్రవాహం

అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటి మట్టం పెరుగుతున్నది. ఆదివారం నాల్గో మోటర్‌ రెండు గంటల పాటు నడిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద నిర్మించిన మహాబావి నుంచి ఐదు రోజులుగా ఒకటో, నాల్గో మోటరు ద్వారా నీళ్లు ఎత్తి పోస్తున్నారు. ఐదు రోజుల్లో రెండు మోటర్లు కలిసి 48 గంటల పాటు నడువగా, ఇప్పటి వరకు సుమారుగా 0.6 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారులు తెలిపారు.

  • అన్నపూర్ణలో కొనసాగుతున్న ఎత్తిపోతలు
  • రిజర్వాయర్‌లోకి 0.6 టీఎంసీ నీళ్లు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదారమ్మ పరుగులు పెడుతున్నది.రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతున్నది. ఒకటో మోటర్‌ ని రంతరంగా నీటిని ఎత్తిపోస్తున్నది. ఆదివారం నాల్గో మోటర్‌ రెండు గంటల పాటు నడిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద నిర్మించిన మహాబావి నుంచి ఐదు రోజులుగా ఒకటో, నాల్గో మోటరు ద్వారా  నీళ్లను ఎత్తి పోస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో రెండు మో టర్లు కలిసి 48గంటల పాటు నడిపించారు. ఇ ప్పటి వరకు సుమారుగా 0.6 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు మోటరు పంపింగ్‌ విధానం తదితర వా టిని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌, ఇంజినీ ర్లు, ఏజెన్సీ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. అ న్నపూర్ణ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, దీని ఎఫ్‌ఆర్‌ఎల్‌  397 ఉంటుంది. ఐదు రోజుల్లో 381.4 లెవెల్‌కు నీళ్లు వచ్చాయి. 11వ ప్యాకేజీ హెడ్‌ రెగ్యులెటర్‌కు నీళ్లు చేరుతున్నాయి. అక్కడి నుంచి  చంద్లాపూర్‌లో భూగర్భంలో నిర్మించిన పంప్‌హౌస్‌లోకి పంపిస్తారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంతం సాగు నీటి కష్టాలు తొలగిపోనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo