శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 15, 2020 , 23:02:51

డయాలసిస్‌ సేవలు బంద్‌

డయాలసిస్‌ సేవలు బంద్‌

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సర్కారు భరోసా కల్పిస్తున్నది. ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యం చేయించుకోలేని వారికి అండగా నిలుస్తున్నది. పేద, గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో 2018లో ఐదు యూనిట్లతో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దానిని 10యూనిట్లకు విస్తరించింది. దేశంలోనే తొలిసారిగా సింగిల్‌ యూజ్డ్‌ డయాలైజర్‌ను ఇక్కడ వినియోగిస్తుండగా, నిత్యం 40మందికి చికిత్స అందిస్తున్నారు. ఫిబ్రవరి వరకు 20,120 సార్లు రోగులకు డయాలసిస్‌ చేశారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 61మంది రోగులకు ఉచిత బస్సు పాసులు అందించారు. కార్పొరేట్‌ తరహా ఉచిత వైద్యం అందిస్తుండగా, పేద, గ్రామీణ ప్రాంతాల రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • కిడ్నీ వ్యాధిగ్రస్త్తులకు సర్కారు భరోసా
  • సిద్దిపేట దవాఖానలో డయాలసిస్‌
  • రోగులకు ఉచితంగా బస్సు పాసులు
  • పది యూనిట్లతో నిత్యం 40మందికి చికిత్సలు
  • వెయిటింగ్‌ లిస్ట్‌లో 60 మంది
  • ఫిబ్రవరి నాటికి 20,120 డయాలసిస్‌
  • దేశంలోనే తొలిసారిగా సిద్దిపేటలో సింగిల్‌ యూజ్డ్‌ డయాలైజర్‌

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : ఆరోగ్యమే మహాభాగ్యం ఇది పెద్దల మాట...కానీ, మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారుతుండడంతో వ్యాధుల ప్రమాదం అదే స్థాయిలో పొంచి ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి ముత్ర పిండాల వ్యాధి. డయాలసిస్‌.. ఈ పదం వింటేనే  భయం.  ఇది మూత్ర పిం డాల వ్యాధిగ్రస్తులకు అందించే ఏకైక చికిత్స విధానం డయాలసిస్‌. ఈ వ్యాధి బారిన పడితే వారి ఇల్లు గుల్లే.. ఆరోగ్యంతో ఆర్థికంగాను తీవ్రమైన నష్టం... దీని ములంగా వ్యాధిగ్రస్తుల  కుటుంబాలది.. దిక్కుతోచని పరిస్థితి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పేద కుటుంబా లైతే రోడ్డున పడాల్సిందే. ఇలాంటి పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో డయాలసిస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటు మూత్ర పిం డాల వ్యాధిగ్రస్తులకు వ్యాధిగ్రస్తులకు వరంలా మారింది. 

 కిడ్ని రోగులు చిక్సిత చేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సేవలను అందుబాటులో  తీసుకవచ్చేందుకు  సిద్దిపేట జిల్లా దవాఖానలో జర్మనీకి చెందిన డిమేడ్‌ సంస్థ సహకారంతో 2018 జూలై 18న  మంత్రి హరీశ్‌రావు, అప్పటి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. 5 బెడ్లతో ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించారు. కానీ, రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో 10 బెడ్లకు అప్‌గ్రేడ్‌ చేశారు. సిద్దిపేటతో పాటు సమీప ప్రాంతాల నుంచి మూత్రపిండాల వ్యాధిగ్ర స్తులు సిద్దిపేటలో డయాలసిస్‌ సేవలు పొందుతున్నారు.  ఈ సేవలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. నెలకు 90 మంది పేషెంట్లకు డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. మరో 60 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటున్నారు.

చికిత్స విధానం 

సిద్దిపేట డయాలసిస్‌ సెంటర్‌లో దేశంలోనే తొలిసారిగా సింగిల్‌యూజ్డ్‌ డయాలైజర్‌ విధానాన్ని వినియోగిస్తూ.. 90 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరికి ఆవసరమైన ఎర్థ్ధోప్యాట్రిక్‌, ఐరన్‌ ఇంజక్షన్లు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. రోజుకు సుమారు 37 నుంచి 40 మంది రోగులకు డయాలసిస్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి నెల వరకు 20,120 సార్లు రోగులకు డయాలసిస్‌ చేశారు. సుమారుగా ఒక్కో పేషెంట్‌కు డయాలసిస్‌ చేయాడానికి 4 గంటల సమయం పడుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రోగులకు రవాణా ఇబ్బందులు కలుగకుండా పేషెంట్లకు ప్రభుత్వం ఉచితంగా బస్‌ పాసులను అందజేస్తుంది. దీంతోపాటు రోగులకు సేవలు అందించేందు కు 10 సిబ్బంది మూడు షిప్టుల్లో విధులను నిర్వర్తిస్తున్నారు. 

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అన్నివైద్య సేవలు

సిద్దిపేట చుట్ట్టు పక్కల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. ఫిబ్రవరి వరకు 20,120 మంది కి డయాలసిస్‌ సేవలు చేశాం. రోజుకు 40 మందికి డయాలసిస్‌ చేస్తున్నాం. డయాలసిస్‌ కోసం సింగిల్‌యూజ్‌డ్‌ డయాలైజర్‌ను వినియోగిస్తున్నాం. రోగులకు ప్రభుత్వం ఉచితంగా బస్‌ పాసులను అందిస్తుంది.

-  అవినాష్‌ (సెంటర్‌ ఇన్‌చార్జి)


logo