ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 15, 2020 , 02:16:14

బడిని బాగు చేయడం అభినందనీయం

బడిని బాగు చేయడం అభినందనీయం
  • పోల్కంపల్లి నరేందర్‌ అందరికి ఆదర్శం
  • ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవీ రమణాచారి
  • కుకునూరుపల్లి పాఠశాల సందర్శన

కొండపాక: తాను చదువుకున్న బడిని బాగు చేయడం అభినందనీయమని, లక్షలాది రూపాయలు వెచ్చించి బడిని బాగు చేసిన పోల్కంపల్లి నరేందర్‌ అందరికి ఆదర్శమని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవీ రమణాచారి కొనియాడారు. శనివారం కొండపాక మండలం కుకునూరుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలను దత్తత తీసుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, అభివృద్ధికి పాటుపడుతున్న పీఎన్‌ఆర్‌ సేవా ట్రస్ట్‌ అధినేత పోల్కంపల్లి నరేందర్‌ సేవా దృక్పథాన్ని, దానగుణాన్ని అభినందించారు. పాఠశాలను అన్ని రకాల వసతులతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారని, పాఠశాల ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా పచ్చదనం పరిశుభ్రతతో ఉన్నదన్నారు. సకల సౌకర్యాలు కల్పించి, కార్పొరేట్‌కు దీటుగా తయారు చేశారని చెప్పారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లిష్‌, తెలుగు నిఘంటువులు అందజేశారు. రాష్ట్రస్థాయి నాటకోత్సవంలో జానపద కళా ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించి ప్రశంసపత్రాలను అందజేశారు. రమణాచారి దంపతులను పోల్కంపల్లి నరేందర్‌, ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపవిద్యాధికారి పెద్ది వైకుంఠం, ఉప సర్పంచ్‌ బాలాగౌడ్‌, ఎంపీటీసీలు భూములు గౌడ్‌, గీత కో ఆప్షన్‌ సభ్యులు అజీమొద్దీన్‌, కనకయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సుదర్శన్‌, ఐలయ్య, అమరేందర్‌, హెచ్‌ఎంలు కనకరాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.logo