ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 07, 2020 , 23:47:22

తొలి పద్దు

తొలి పద్దు
  • రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
  • ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి అవకాశం
  • జిల్లాకు అధిక నిధులు వస్తాయని ఆశలు
  • సాగునీటి రంగానికే అధిక ప్రాధాన్యం
  • జిల్లాలో పూర్తికావొస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రశాసనసభలో తొలిసారి గా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 2020-21 వార్షిక బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈసారి బడ్జెట్‌లో జిల్లాకు  పెద్దఎత్తున నిధులు వస్తాయన్న ఆశ తో ఆయా నియోజక వర్గాల శాసనసభ్యులు, ప్రజలు ఉన్నారు. ము ఖ్యంగా బడ్జెట్‌లో వ్యవసాయం, సా గునీరు, విద్య, వైద్యం తదితర పథకాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. రాష్ట్ర రైతాంగానికి సాగు నీరందించాలన్న లక్ష్యంగా  త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించనున్నారు. సీఎం కేసీఆర్‌ రైతు బిడ్డ కావడంతో.. ఇవాళ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యత కల్పించేలా బడ్జెట్‌ ఉండనున్నదని సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీకి నిధులు కేటాయించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు  వృద్ధాప్య పెన్షన్‌ కనీస అర్హత వయస్సు 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడంతో వారికి పెన్షన్‌ అందనున్నది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చింది. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు కావాల్సిన అధికారాలను విధులతో పాటు నిధులను కేటాయించడంతో గ్రామాలు అద్భుతంగా తయారవుతున్నాయి. ఈ బడ్జెట్‌లో పల్లెలకు మరిన్నీ ప్రత్యేకంగా నిధులు రానున్నాయి. 


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, శ్రీరంగనాయక సాగర్‌, కొండ పోచమ్మ రిజర్వాయర్ల పనులు పూర్తి చేశారు. త్వరలోనే గోదావరి జలాలు రానున్నాయి. వీటితోపాటు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లతో పాటు కాల్వల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అన్ని ప్రా జెక్టుల ద్వారా రైతాంగానికి సాగు నీరు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభు త్వం ఈ బడ్జెట్‌లో జిల్లాకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే,  హరితహారం, రోడ్లు,  ఇతర రంగాలకు నిధులు భారీగానే రానున్నాయి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడంతోపాటు జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా నిధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 


logo