గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Mar 07, 2020 , 23:43:23

అకాల వాన

అకాల వాన

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి, మ ద్దూరు, చేర్యాల మండలాల్లో శనివారం అకస్మాత్తు గా భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బు లుగా ఉన్న వాతావరణం 10 నుంచి మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో భారీవర్షంగా మారింది. దీంతో పట్టణంతోపాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వీధులన్నీ జలమయంగా మారాయి. పట్టణంలోని ప్రధాన రహదారిపై నీరు నిలిచి చెరువును తలపించింది. మల్లన్న క్షేత్రంలో భారీ వర్షం కురువడంతో  భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయంలోని యూ బిల్డింగ్‌లోకి వరదనీరు చేరింది. అలాగే, చేర్యాల మండలం ఆకునూరులోని ప్రభుత్వ పాఠశాల అవరణలోకి వర్షపునీరు చేరింది. వరదనీరు వెళ్లే మార్గం మూసుకుపోవడంతో పాఠశాలలోకి నీరు చేరిందని టీఆర్‌ఎస్వీ మండల ఉపాధ్యక్షుడు తాటికొండ సదానందం, వార్డుసభ్యుడు మహ్మద్‌హైమత్‌ తెలిపారు. 


హుస్నాబాద్‌లో మోస్తరు వర్షం

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ :  పట్టణంతోపాటు మండలంలో మో స్తరు వర్షం కురిసింది. ఉదయం  మే ఘావృతమైన వాతావరంతో మధ్యా హ్నం వర్షం కురవడం వల్ల పట్టణంలోని రోడ్లన్నీ నీట మునిగాయి. కొన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంటచేలల్లో నీళ్లు నిలిచాయి. వరి, మొక్కజొన్న పంటలకు వర్షం కొంత ఊరటనిస్తుందని, అయితే, వరికి తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని రైతులు అంటున్నారు.  


గజ్వేల్‌ అర్బన్‌ : పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఉద యం 8 గంటల నుంచి దాదాపు అరగంట వరకు  వర్షం కురువడంతో వాతావరణం చల్లబడింది. 


మద్దూరు : మండలవ్యాప్తంగా 10.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొక్కజొన్న, వరితో పాటు మామిడితోటలకు కొంత నష్టం వాటిల్లింది. మద్దూరులోని పలువురి ఇండ్లలోకి వర్షం నీరు చేరుకుంది. బెక్కల్‌లో కల్లెం బాలమ్మ ఇంటిపై కప్పులు కూలాయి. నిరాశ్రయురాలైన బాలమ్మను ప్రభు త్వం ఆదుకోవాలని సర్పంచ్‌ బాలరాజు కోరారు.


కోహెడ : మండలంలోని వరికోలు, రాంచంద్రాపూర్‌లో భారీగా, ఇతర గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఎక్కడాఎలాంటి నష్టం జరుగలేదు. 


logo