సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 07, 2020 , 04:59:14

పట్టణాల్లో ప్రగతి మార్పు

పట్టణాల్లో ప్రగతి మార్పు
  • సమస్యల గుర్తింపు.. పరిష్కారం
  • తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన
  • ఇంటింటికీ చెత్త సేకరణ బుట్టల పంపిణీ
  • స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణమే లక్ష్యంగా పనులు
  • మంత్రి హరీశ్‌రావు సహకారంతో పట్టణాన్ని ఆదర్శంగా మార్చుతామని కౌన్సిలర్ల ప్రతిన

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, సమగ్రంగా అభివృద్ధి చేయాల నే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రూపొందించిన బృహత్తర కార్యక్రమం పట్టణ ప్రగతి. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంతోపాటు పట్టణాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయను న్నారు.  దీంతోపాటు సమర్థవంతంగా పారిశుద్ధ్య నిర్వహ ణ చేపట్టడం, ఇండ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడిగా వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం, హరితహారంలో భాగంగా మొక్క లను నాటడం వంటి కార్యక్రమాలతో పట్టణాల సమగ్ర స్వ రూపాన్ని మార్చేందుకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డుల వారీగా పలు సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కరించారు. 

 సిద్దిపేట మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పాడుబడిన ఇండ్లు, కరెంట్‌ స్తంభా లు, రోడ్లపై గుంతలతోపాటు నూతనంగా కరెంట్‌ స్తంభాల ను ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. పట్టణంలో మొత్తం 1568 ఖాళీ స్థలాలను గుర్తించి 594 స్థలాల్లో శుభ్రపర్చా రు. 


శిథిలావస్థకు చేరిన 185  భవనాలను గుర్తించి, వీటిలో 36 భవనాలను కూల్చివేశారు. తుప్పుపట్టి  ప్రమాదకరంగామారిన 283 ఇనుప కరెంట్‌ స్తంభాలను గుర్తించి, 19 స్తం భాలను తొలగించారు. వేలాడే విద్యుత్‌ వైర్లను సరిచేశారు. నూతనంగా 67 వీధి దీపాలను బిగించారు. పరిశుభ్ర, ఆకుపచ్చ, ప్లాస్టిక్‌ రహిత సిద్దిపేట కోసం మున్సిపల్‌ అధికారు లు, ప్రజాప్రతినిధులు, మహిళలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. మొత్తం పట్టణంలో 69500 చెత్త సేకరణ బుట్టలను అందజేశారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు తేవడానికి ప్లాస్టిక్‌ కవర్లు వాడకుండా ఇంటింటికీ నారసంచులు అందజేశారు. తడి చెత్త ను మందపల్లి డంపింగ్‌ యార్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారీకి, పొడి చెత్తను ఐటీసీ సహకారంతో విద్యుత్‌ వినియోగం కోసం అందజేస్తున్నారు. అలాగే, స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 34 వార్డుల్లో మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బందితో మురుగు కాల్వలను శుభ్రపర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. 


 పట్టణ ప్రగతితో సమస్యల పరిష్కారం 

 పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పది రోజులపాటు అన్ని వార్డుల్లో నిర్వహిం చాం. పట్టణంలో 1568 ఖాళీస్థలాలను గుర్తించి 594 ఖాళీ స్థలాల్లోని చెత్తను ఎత్తి శుభ్రపర్చడం జరిగింది. 185 శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి, వీటిలో 36 భవనాలను కూల్చివేయిం చాము. వీటితో పాటు ప్రతి ఇంటికీ చెత్త బుట్టలను అందజేశాం. పట్టణంలో 69500 చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేసి, మహి ళలకు అవగాహన కల్పించి చెత్తను  తడి, పొడిగా వేరు చేసేలా చైతన్యపరిచాం. పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను మంత్రి హరీశ్‌రావు సహకారంతో దశలవారీగా పరిష్కరిస్తాం. తుప్పు పట్టిన ఇనుప స్తంభాలను తొలగించి,  కరెంట్‌ సమస్యలను పరిష్కరించాం. పట్టణాన్ని క్లీన్‌, గ్రీన్‌, ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.         - మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు 


చెత్తను తడి, పొడిగా వేరు చేసేలా అవగాహన కల్పించాం..

పట్టణ ప్రగతి కార్యక్ర మం ద్వారా ప్రతి ఇంటికీ రెండు చెత్త సేకరణ బుట్టల ను అందజేశాం. చెత్తను త డి, పొడిగా  వేరు చేసి ఇచ్చే లా మహిళలకు అవగాహ న కల్పించాం. వార్డుల్లోని సమస్యలను గుర్తించి, కొన్ని సమస్యలను పరిష్కరించాము. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా మురుగునీటి కాల్వలను శుభ్రపర్చాం. ప్లాస్టిక్‌  అనర్థాలను ప్రజలకు వివరించి, నారసంచులు వాడేలా అవగాహన కల్పించాం. ఖాళీ స్థలాల్లో చెత్తను ఎత్తి ఖాళీ స్థలాలను శుభ్రపర్చాం.     - మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి  


logo