ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 04, 2020 , 23:54:39

పోలీసులకు వైద్య పరీక్షలు

పోలీసులకు వైద్య పరీక్షలు

సిద్దిపేట టౌన్‌ : పోలీసులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి అనేక కా ర్యక్రమాలు చేపడుతుందని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. కమిషనరేట్‌ కార్యాలయ ఆవరణలో యశోద దవాఖాన సౌజన్యంతో ఉచిత మెడికల్‌ క్యాంపును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ జోయల్‌ డెవిస్‌ మాట్లాడుతూ పోలీసులు నిరంతరం విధి నిర్వహణలో ఉండడంతో ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఎంతో అవసరమని, సిబ్బంది కుటుంబ సభ్యులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. పోలీసుల దినచర్య మిగతా వారితో పూర్తిగా భిన్నంగా ఉంటుందని, ఆరోగ్య పరిరక్షణకు నడక, వ్యాయామం, యోగా వంటివి దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు. మనం తీ సుకునే ఆహార పదార్థాల్లోనే కల్తీ ఉంటుందని, వాటిని కూడా జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. కొన్ని వ్యాధులకు వైద్యం సరిగా అందకపోయేదని,  ప్రస్తుతం అ న్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, పోలీసులందరూ ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 40 సంవత్సరాలు పైబడిన వారందరూ మూడు నెలలకొకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. 


150 మందికి పరీక్షలు 

పోలీసుల సంక్షేమానికి నిరంతరం ప్రభుత్వం పాటుపడుతుందని సీపీ జోయల్‌ డెవిస్‌ అన్నారు. అందులో భాగంగా ప్రతి నెల మొదటి వారం బుధవారం సిబ్బందికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వైద్య క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, షుగర్‌, ఈసీజీ తదితర పరీక్షలను అనుభవజ్ఞులైన వైద్యులచే నిర్వహించారు. వైద్య శిబిరంలో 150 మంది పోలీసు సిబ్బంది వారి కు టుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు బాబురావు, రి యాజ్‌ హుల్‌ హక్‌, ఏసీపీలు సురేందర్‌, శ్రీనివాస్‌, బాలాజీ, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


logo