శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 01, 2020 , 22:43:01

జోరుగా పట్టణ ప్రగతి పనులు

జోరుగా పట్టణ ప్రగతి పనులు

హుస్నాబాద్‌టౌన్‌: హుస్నాబాద్‌ పట్టణంలో పట్టణ ప్రగతి జోరుగా సాగుతున్నది. పట్టణంలోని ఇరువై వార్డుల్లో ప ట్టణ ప్రగతి కార్యక్రమాలు మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, శిథిలమైన భవనాల తొలగింపు, ర హదారులపై మట్టిని తొలగించి, వీధులను శుభ్రం చే యడం, ఖాళీ స్థలాల్లో పనికిరాని చెట్లను తీసివేసే కార్యక్రమం భారీగా సాగుతున్నది. పట్టణంలోని పలు ఖాళీ స్థలాలు పనికిరాని చెట్లతో నిండిపోయి, చెత్తాచెదారానికి నిలయమైన ప్రాం తాలు పట్టణ ప్రగతిలో భాగంగా వాటిని తొలగించడంతో పరిశుభ్రంగా మారాయి. ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో పట్టణమంతా యుద్ధప్రాతిపదికన ప నులు సాగుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఒకటోవార్డులో శిథిలమైన ఇండ్లతొలగింపు కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, కమిషనర్‌ రాజమల్లయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ ఇన్‌చార్జి కాసర్ల అశోక్‌బాబు, వార్డు కౌన్సిలర్‌ కొంకట నళినిదేవి పాల్గొన్నారు. నాల్గోవార్డులో పర్యటించిన మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ అయిలేని అనిత ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఐదోవార్డులో ఖాళీస్థలాల్లో పెరిగిన పనికిరాని చెట్ల తొలగింపు, వీధులను శుభ్రంచేసే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పెరుక భాగ్యారెడ్డి, 10వ వార్డులో జరిగిన మురికి కాల్వల్లో చెత్తతొలగింపు కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ గోవిందు రవి, 11వ వార్డులో శిథిలమైన భవనాన్ని తొలగించే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ దొడ్డి శ్రీనివాస్‌, 13వ వార్డులో హనుమాన్‌ దేవాలయ పరిసరాలను పరిశుభ్రం చేసే పనిలో వార్డు కౌన్సిలర్‌ బొల్లి కల్పన, 19వ వార్డులో వీధులను శుభ్రంచేసే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బొజ్జ హరీశ్‌, 20వ వార్డులోని చారిత్మ్రాకమైన బురుజుపై పెరిగిన చెట్లను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంచేసే పనిని కౌన్సిలర్‌ వాల సుప్రజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ బురుజుకు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పట్టణ ప్రజలు హర్షిస్తున్నారు. 

కాగా, పట్టణ ప్రగతిలో తాము సైతం అంటూ 19వ వార్డులోని కౌన్సిలర్‌ బొజ్జ హరీశ్‌ ఆధ్వర్యంలో యువత ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ఖాళీ స్థలంలో పెరిగిన పనికిరాని చెట్లను తొలగించడంతోపాటు వీధులను ఊడ్చే కార్యక్రమాల్లో వారు పాల్గొని శ్రమదానం చేశారు. కార్యక్రమంలో వార్డు ప్రత్యే కాధికారి కాశబోయిన విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.   logo