శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 28, 2020 , T00:30

అభివృద్ధిలో దుబ్బాక ఆదర్శంగా నిలువాలి

అభివృద్ధిలో దుబ్బాక ఆదర్శంగా నిలువాలి
  • ప్రజల మౌలిక వసతుల కల్పనకు కృషి
  • శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

దుబ్బాక టౌన్‌: రాష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు  శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలో రూ. 3 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన టౌన్‌హాల్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దుబ్బాక పర్యటనలో టౌన్‌హాల్‌ నిర్మాణం కోసం మంజూరు చేసిన ఎస్‌డీఎఫ్‌ నిధుల ద్వారా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.  ప్రజల సోమ్ముతో జరిగే అభివృద్ధి పనుల పై ఏలాంటి లోపం ఉండకూడదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో దుబ్బాక, మిరుదొడ్డి ఎంపీపీలు కొత్త పుష్పలత కిషన్‌రెడ్డి, గజ్జెల సాయిలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత భూంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అధికం సుగుణ బాలకిషన్‌గౌడ్‌, కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, మున్సిపల్‌ శాఖ ఈఈ వీరప్రతాప్‌, ఏఈ పృథ్వీరాజ్‌, కౌన్సిలర్లు, నాయకులు రొట్టె రాజమౌళి, ఆసస్వామి, సంజీవరెడ్డి,  పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కాల్వ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ తల్లి చౌరస్తాలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.  


logo