బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 28, 2020 , T00:11

త్రివర్ణ శోభితం

త్రివర్ణ శోభితం
  • బటర్‌ఫ్లై స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు
  • మంత్రి హరీశ్‌రావు కృషితో అందుబాటులోకి..

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట త్రివర్ణ శోభితకాంతులను విరాజిమ్ముతున్నది. అణువణువుననా దేశభక్తి పెంపునకు ప్రత్యేకంగా మువ్వన్నెల జెండా రంగుల్లో ఎల్‌ఈడీ లైట్లను బిగించారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట పాత బస్టాండ్‌ నుంచి హైదరాబాద్‌ రోడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ఈ లైట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ మాదిరిగానే సిద్దిపేటలో మొట్టమొదటి సారిగా ఈ లైట్లు వెలుగులు జిమ్ముతున్నాయి. మున్సిపల్‌ శాఖ ప్రత్యేకంగా 130 బటర్‌ఫ్లై  స్థంభాలకు లైట్లను బిగించారు. ప్రజలందరిని దేశభక్తిలో మైమరిపించేలా చేసింది. కండ్లు మిరుమిట్లు గొలిపేలా రాత్రి వేళలో త్రివర్ణ కాంతులు ప్రజలందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.


logo