గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 28, 2020 , T00:10

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నంగునూరు: రైతులందరూ సేంద్రియ వ్యవ సాయం వైపు మళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మంత్రి ఆదేశానుసారం గురు వారం నంగునూరు మండల సర్పంచులు, ఎంపీ టీసీలు, రైతు సమన్వయ సమితి నాయకులు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జీడిమెట్ల హైదరాబాద్‌లో నిర్వ హించిన అవగాహన సదస్సుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సదస్సులో శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువు తయారీ, సేంద్రియ వ్యవసాయం, హార్టికల్చర్‌ నూతన విధానాలు, బిందు సేద్యంతో తక్కువ నీటి వినియోగం ఎక్కువ దిగుబడులు తదితర అంశాలపై వివరించారు. రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభిస్తే పెట్టుబడి ఆదాతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. అవగాహన సదస్సుకు తరలివెళ్లిన వారిలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బద్దిపడగ కిష్టారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కోల రమేశ్‌గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. 


logo