మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 28, 2020 , T00:05

ఇబ్రహీంపూర్‌లో యువరైతు శిక్షణ కార్యక్రమం

ఇబ్రహీంపూర్‌లో యువరైతు శిక్షణ కార్యక్రమం

సిద్దిపేట రూరల్‌: కార్నెల్‌ సద్గురు ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారి సాంకేతిక పరిజ్ఞానంతో, అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ వారి ఆర్థిక సహకారంతో 6 రోజుల పాటు జరిగే యువరైతు శిక్షణ కార్యక్రమం మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం నాల్గవ రోజు కొనసాగింది. నాల్గవ రోజు శిక్షణలో భాగంగా మట్టి నమూనా ప్రాముఖ్యత, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫార్సులపై డా. సాయినాథ్‌, భూగర్భ జల వనరుల నిర్వహణపై నరసింహారావు, తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద ఉత్పత్తికి, ఆహార ఉత్పత్తి, నిర్వహణ వ్యూహాల పై డా.టి.శశికళ అవగాహన కల్పించారు. సీనియర్‌ శాస్త్రవేత్త,  డా.ఏవి రామాంజనేయులు ఆధ్వర్యంలో యువ రైతులు నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్‌లో పర్యటించి గ్రామంలో ఉన్న నీటి కుంటలను, వానపాముల ఎరువుల తయారు చేసే యూనిట్లను పరీశిలించారు. అలాగే చిన్నకోడూరు మండలం సలేంద్రిలో ఇంకుడు బోరు బావులు, వివిధ పంటలలో సూక్ష్మ సేద్య నీటి పద్ధతులను సందర్శించి అభ్యుదయ రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భూగర్భ జలశాఖ ఏఈ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo