బుధవారం 03 జూన్ 2020
Siddipet - Feb 25, 2020 , 02:16:02

ప్రగతి సంకల్పం

ప్రగతి సంకల్పం
  • జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రగతికి శ్రీకారం
  • తొలిరోజు కార్యక్రమం ఉద్దేశం, వివరాలు వెల్లడి
  • అన్ని వార్డుల్లో ప్రత్యేక సమావేశాలు
  • సమస్యలు పరిశీలించిన కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు
  • దుబ్బాక, హుస్నాబాద్‌లలో పర్యటించిన ఎమ్మెల్యేలు సోలిపేట, వొడితెల
  • గజ్వేల్‌లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన కలెక్టర్‌

పట్టణాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచే సంకల్పంతో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి సోమవారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభ మైంది. ఉదయాన్నే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటిం చారు. వార్డుకు కేటాయించిన ప్రత్యేకాధి కారు లు, కమిటీ సభ్యులు తొలుత కార్యక్రమ ఉద్దేశం , వివరాలను ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించారు. అనంతరం వార్డుల్లో పర్య టించి స్థానికులను సమస్యలడిగి తెలుసు కున్నా రు. ఇప్పటివరకు ఎందుకు అపరిష్కృతంగా ఉన్నా యో  ఆరా తీశారు. దుబ్బాక,హుస్నాబాద్‌ పట్టణాల్లో ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి,వొడితెల సతీశ్‌కుమార్‌, గజ్వేల్‌ పట్టణం 1వ వార్డులో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, చేర్యాలలో శాసనమండలి చీఫ్‌విప్‌ బోడెకుంటి వెంక టేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పట్టణ ప్రగతిని ప్రారంభించారు. సమస్యల్లేని పట్టణాలుగా మార్చేందుకే సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని వారు వివరించారు. తొలిరోజు చెత్తాచెదారం తొలగింపుతోపాటు మురుగు కాల్వలను శుభ్రం చేశారు.                                                  -సిద్దిపేట ప్రతినిధి,నమస్తేతెలంగాణ  


గజ్వేల్‌,నమస్తే తెలంగాణ/ గజ్వేల్‌ అర్బన్‌: సీఎం కేసీఆర్‌ పట్టణాల సమగ్రాభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలోని మొదటి వార్డులోని ఎస్సీ కాలనీలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళిలతో కలిసి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించడానికి సీఎం కేసీఆర్‌ పాలనాపరంగా ఎంతో నిష్ణాతులైన అధికారులతో సమగ్రంగా చర్చించి రూపొందించారన్నారు. పల్లె ప్రగతి ద్వారా పంచాయతీరాజ్‌ చట్టాన్ని, పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్‌ చట్టాన్ని ప్రజలకు సంపూర్ణంగా అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గ్రామాలన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా కావడంతో పాటు సమస్యల పరిష్కారం జరిగిందని, అదేవిధంగా పట్టణ ప్రగతి ద్వారా కూడా మున్సిపాలిటీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పట్టణంలోని పారిశుధ్య చర్యలను సంపూర్ణంగా నిర్వహించడం లక్ష్యంగా సాగుతుం దన్నారు. అలాగే విద్యుత్‌, నీరు, పరిసరాల పరిశుభ్రత తదితర సమస్యల పరిష్కారానికి స్థానిక కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు, వార్డుల ప్రజలే స్వయంగా పరిష్కరించుకుంటున్నారన్నారు. 


సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దాకా ప్రజలు రాకముందే పాలన, అధికార యంత్రాంగాన్నే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకురావడమే సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. పట్టణ ప్రగతిలో చైర్మన్‌తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు, ప్రజలంతా సమన్వయంతో పనిచేసి వార్డులను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మార్చడానికి కృషి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలోనే గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలన్నారు. మన రాష్ట్రంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా చేపడుతున్న పనులు ఇతర రాష్ర్టాల్లో పదేండ్ల తర్వాత చేపట్టబోనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కార్యక్రమాలను రూపకల్పన చేశారన్నారు. నూతన మున్సిపల్‌ చట్టంపై ప్రజలు, ప్రజాప్రతినిధులకు సంపూర్ణ అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ చట్టం గురించి తెలుసుకోవడం వల్ల తమకు మున్సిపాలిటీ ద్వారా ఎలాంటి సేవలు పొందగలమో తెలుసుకోగలరుతారన్నారు. చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులోని సమస్యలను ఎక్స్‌రే తీయాలని, ఎక్స్‌రేలో దేహంలోని సమస్యలు ఎంత బాగా తెలుసుకుంటామో అలాగే వార్డుల్లోని ప్రతి సమస్యను కౌన్సిలర్లు గుర్తించి పరిష్కరించాలన్నారు. 


వార్డులలో పరిశుభ్రత చర్యలు ఎంత అవసరమో హరితహారం మొక్కలు నాటి సంరక్షించడం కూడా అంతే అవసరమన్నారు. ప్రతి వార్డులో నాటిన మొక్కలు ఎనభై శాతం ఎదగాలని, లేని పక్షంలో కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వార్డులలో మానవ వనరుల అభివృద్ధి, పెన్షనర్లు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. వార్డులలో మురికి కాల్వల నిర్వహణ, కార్మికుల పనితీరు, చెత్త సేకరణ నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే తాగునీటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటి ఖాతాలలో నెలనెలా నిధులు పారిశుధ్య, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులను జమచేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవడానికి, వార్షిక, పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సంపూర్ణ పట్టణ ప్రగతి జరగాలని, ప్రాధాన్యత క్రమంలో సమస్యలను గుర్తించి పనుల నిర్వహణకు వార్డుల కమిటీలతో చర్చించి మున్సిపల్‌ కౌన్సిల్‌లో ప్రణాళికలను చర్చించి తీర్మానించాలన్నారు. విద్యుత్‌, స్తంభాలు విరిగినా, వంగినా, తీగలు కిందికి వేలాడినా, కౌన్సిలర్ల దృష్టికి తీసుకువెళ్లి మరమ్మత్తులు చేయించుకోవాలన్నారు. 


ఈ 10రోజుల పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి మాట్లాడుతూ ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక పాలనను అందించడానికి సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ చట్టం ఏర్పాటు చేశారన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం, ప్రజారోగ్య వాతావరణ ఏర్పాటు కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వార్డులో కౌన్సిలర్లతో సహకరించి ప్రజలు ఇంటింటి పరిశుభ్రతను పాటించడంతో పాటు తమ వీధుల్లో పరిశుభ్ర వాతావరణ ఏర్పాటుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, జడ్పీటీసీ పంగ మల్లేశం, కౌన్సిలర్లు బొగ్గుల చందు, ఉప్పల మెట్టయ్య, రహీం, ఇతర కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. 


logo