మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 24, 2020 , 23:50:51

కాల్వల భూసేకరణ వేగిరం చేయండి

కాల్వల భూసేకరణ వేగిరం చేయండి
  • ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోండి nభూతగాదాలను త్వరగా పరిష్కరించండి
  • ఉన్నతస్థాయి అధికారుల సమీక్షలో కలెక్టర్‌ ఆదేశం

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : జనగణన -2021 లెక్కలను పకడ్బందీగా సమర్థవంతంగా చేపట్టి, జిల్లాకు మంచిపేరు తేవాలని అధికారులకు  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జనగణన- 2021పై రెండు రోజులపాటు  అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమ వారం శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు. 2021 జనాభా గణన లెక్కలను రెవెన్యూ గ్రామాల వారీగా, మున్సిపల్‌ బ్లాక్‌ల వారీగా లోతుగా అధ్యయనం చేయాలన్నారు. శిక్షణలో అధికారులకు, పలు అంశాలపై సూచనలు చేశారు. 2021 జనగణనలో ఎన్యూమరేటర్లను గుర్తించాలన్నారు. జనగణనలో 2011జనగణన ప్రతిపాదికన మార్పులు, చేర్పులను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జనగణన-2021 డిప్యూటీ డైరక్టర్‌ శ్రీకాంత్‌, డైరక్టర్‌ రఘరామ్‌, జడ్పీ సీఈవో శ్రవణ్‌కుమార్‌, ఏవోలు శ్రీనివాస్‌, రమేశ్‌రావు, వివిధ శాఖల ఆధికారులు పాల్గొన్నారు.


 కాల్వల భూసేకరణ పూర్తి చేయాలి
* తహసీల్దార్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో సమీక్ష

సిద్దిపేట రూరల్‌ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన, అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని తహసీల్దార్లు, ఇంజినీర్లు, సర్వేయర్లను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. సిద్దిపేటలోని సమీకృత కలెక్టరేట్‌లో జిల్లాలోని అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ జలాశయాలు, దేవాదుల ప్రాజెక్టు ప్రత్యేకించి కాల్వ ల భూ సేకరణ అంశాలపై గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, కొండపోచమ్మ ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌, దేవాదుల ప్రాజెక్టు ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డితో కలిసి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలా లు, గ్రామాలకు కాల్వలు తవ్వించి అన్ని గ్రామాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని ఆదేశించారు. కాల్వల భూ సేకరణలో భా గంగా ఉత్పన్నమయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, భూ తగదాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఆయా మండల తహసీల్దార్ల సహకారం తీసుకోవాలని సూచించారు.  


దుబ్బాక నియోజకవర్గం..  అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్ష 

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దుబ్బాక నియోజకవరంలోని అసంపూర్తి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అడిషినల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ని ర్మాణాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. దీపాయంపల్లి, పోతారెడ్డిపేటలో ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, లబ్ధిదారుల ఎంపిక  చేపట్టాలన్నారు. అలాగే తాగునీరు, విద్యుత్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దుబ్బాకలో మహిళా భవనం, మున్సిపాలిటీ భవనం, నైట్‌ షెల్టర్‌, షాదీఖానా, ఐటీఐ భవనం, సమీకృత కార్యాలయం, హబ్సీపూర్‌ మినీ స్టేడియం, వంద పడకల దవాఖాన, సీఎం కేసీఆర్‌ చదువుకున్న పాఠశాల నిర్మాణం, దౌల్తాబాద్‌, దుబ్బాక షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, దుబ్బాక రింగు రోడ్డు పనుల పురోగతిపై సమీక్షించారు. సమీక్షలో పీఆర్‌ ఈఈ కనకరత్నం, డీఎఫ్‌వో శ్రీధర్‌, ఎస్‌ఈ కరుణాకర్‌బాబు, డీఎంహెచ్‌వో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo