ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 22, 2020 , 23:54:38

సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక మల్లన్న ఆలయం

సంస్కృతీసంప్రదాయాలకు  ప్రతీక మల్లన్న ఆలయం

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారని, విస్తారంగా వానలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా కొమురవెల్లి   మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శుక్రవారం అర్థరాత్రి దాటిన అనంతరం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీసంప్రదాయలకు ప్రతీకగా కొమురవెల్లి మల్లన్న చరిత్ర ఉందని, అందుకే సీఎం కేసీఆర్‌కు కొమురవెల్లి మల్లన్న అంటే ఎంతో భక్తిని అందుకే కొమురవెల్లి మల్లన్న పేరిట మల్లన్నసాగర్‌ నిర్మిస్తున్నారని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగానే ఈ ప్రాంత రైతులకు రెండు పంటలకు సరిపడా సాగు నీరు అందుతుందన్నారు.తపాస్‌పల్లి ప్రాజెక్టును స్టాక్‌ పాయింట్‌గా చేసి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, జనగామ తదితర ప్రాంతాలకు సాగు నీటిని కాల్వల ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కొమురవెల్లి మల్లన్న స్వయాన రైతుబిడ్డగా చరిత్ర చెబుతున్నదని, అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనను ఇలవేల్పుగా భావించి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. 


పెద్దపట్నం రోజున పూజారులు వేసిన పట్నం చూర్ణం తీసుకువెళ్లి రైతులు వారి పొలాల్లో చల్లుతారని, దీంతో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పశుసంపద పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ఏర్పాటు అనంతరం మల్లన్న ఆలయం డెవలప్‌మెంట్‌ అవుతున్నదని భక్తులే స్వయంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సరిపడా వసతులు కల్పించేందుకు ఆలయవర్గాలు చర్యలు తీసుకుంటున్నారని, భక్తుల సేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. ఆయనతో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, ఆల య ఈవో టంకశాల వెంకటేశ్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, ఉట్కూరి అమర్‌, బొంగు నాగిరెడ్డి,  మల్లయ్య, యావజుల ఐలయ్యతదితరులు పాల్గొన్నారు.


logo