గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 22, 2020 , 02:35:36

ప్లాస్టిక్‌పై వినూత్న సమరం

ప్లాస్టిక్‌పై వినూత్న సమరం

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : ప్లాస్టిక్‌ నిషేధాన్ని  అమలు చేయడానికి జిల్లాలో వినూత్న చర్యలు చేపడుతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజలను కూడా భాగస్వాముల ను చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉంచడం అవసరమని భావించిన జిల్లా యంత్రాంగం ప్ర త్యేక ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వం మున్సిపాలిటీలతోపాటు పంచాయతీల్లో ప్లాస్టిక్‌ వాడకాన్నీ నిషేధించడానికి అనేక చర్యలు చేపట్టాలని భావిస్తుంది. ఇందుకనుగుణంగా ప్రత్యామ్నాయ చర్య లు కూడా చేపట్టింది. బెంగుళూరుకు చెందిన ప్ర ముఖ ఎన్జీవో సంస్థ సహాస్‌ ప్రతినిధులు సునీత, డాక్టర్‌ శాంతి తదితరులు తడి, పొడి చెత్త సేకరణ, పర్యావరణ పరిరక్షణ, సాలీడ్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ తదితర అంశాలను వివరించారు. 

   ప్లాస్టిక్‌ను నిషేధంతో సరిపోదని దానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతేనే ఫలితాలు అ నుకున్నట్లు ఉంటాయని వివరించారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్‌ పాత్రల వాడ కం స్థానంలో ప్రత్యామ్నాయ పా త్రలను అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావుకు అలోచన తట్టింది. అనుకున్నదే తడువుగా గ్రామాల తోపాటు పట్టణాల్లో స్టీల్‌ పాత్రల బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి పనికి ప్లాస్టిక్‌ను వినియోగిస్తే పర్యావరణానికి, మాన వ మనుగడకు ఎంత హాని చేస్తుందో ప్రజలకు వివరించి, అవగాహన కల్పిస్తా రు. అవసరం ఉన్నా.. లేకపోయినా.. ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించే చర్యలు మానవ మనుగడను ఏ విధం గా ప్రమాదంలోకి నెట్టేస్తుందో.. ప్లాస్టిక్‌ సామగ్రితో వచ్చే అనా ర్థాలను ప్రజలు గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట, పేపర్‌ బ్యాగుల వాడకంపై ప్రజల్లో మార్పు తేవడం,  తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ను అందుబాటులోకి తెస్తున్నారు..

స్టీల్‌ పాత్రల బ్యాంక్‌ ఏర్పాటు..

స్థానికులపై ఆర్థిక భారం పడకుండా ప్రకృతి వనరులపై ప్రతికూల ప్రభావానికి చోటులేకుం డా ఓ కొత్త విప్లవాత్మక ప్రత్యామ్నాయ పద్ధతిని జిల్లాలో అమలులోకి తెస్తున్నారు. మున్సిపాలిటీల్లో వివిధ పనులు, కార్యక్రమా లకు పెద్దమొత్తంలో ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు, ఇతర పాత్రలు వాడుతున్నారు. వాటిని వాడి పారేయడం వల్ల పర్యావరణ ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే మున్సిపాలిటీల్లో సూమారు రూ.20 లక్షల వ్య యంతో స్టీలు పాత్రలు కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నారు. పట్టణం లో స్టీల్‌ బ్యాంకు నుంచి తీసుకువెళ్లి కార్యక్రమం పూర్తయిన తర్వాత అద్దెతో సహ తీసుకుని వెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే, గ్రామాల్లో కూడా ఇదేవిధంగా స్టీల్‌ పాత్రల బ్యాంకు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్లా స్టిక్‌ వస్తువులు వాడితే ఎంత ఖర్చు వస్తుం దో అంతకన్న తక్కువ ఖర్చు స్టీల్‌ బ్యాంకు లో అద్దె ఉండేట్లు చూడాలని సూచించా రు. ఈ పద్ధతితో విజయవంతంగా ప్లాస్టిక్‌ నిషేధం అవుతుందని గురువారం గజ్వేల్‌లో జరిగిన పల్లెప్రగతి సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పద్ధతిని జిల్లావ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

స్థానిక సంస్థలు సగం.. కలెక్టర్‌ సగం నిధులు..

స్టీల్‌ బ్యాంకు గ్రామాల్లో ఏర్పాటుకు నిధుల సమీకరణ ఏర్పా ట్లు చేశారు. గ్రామపంచాయతీ 50 శాతం  నిధులు కేటాయిస్తే..  కలెక్టర్‌ 50 శాతం నిధులు సమకూరుస్తారు. ఒక గ్రామపంచాయతీ రూ.2లక్షలు కేటాయిస్తే.. అంతే మొత్తాన్ని కలెక్టర్‌ అందజేస్తారు.  గ్రామపంచాయతీలో ఎంత కేటాయిస్తే.. అంతే మొత్తాన్ని కలెక్టర్‌ కూడా ఇస్తారు. ఇందుకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సైతం స్పందించారు.  ఎంపీ కోటాలో రూ. 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు తాను కేటాయించిన నిధులను కలెక్టర్‌ వద్ద అం దుబాటులో ఉంచుతానని పేర్కొన్నారు. స్టీల్‌ పాత్రల బ్యాంకు ఏర్పాటు, నిర్వాహణను గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఇందుకు కలెక్టర్‌ కూడా అంగీకరించారు. దీంతో రాష్ట్రంలో వినూత్న పద్ధ్దతిలో ప్లాస్టిక్‌ నిషేధం జిల్లాలో అమలులోకి వస్తుంది. మనం పాటించే పద్ధతి మిగాతా జిల్లాలకు అదర్శమవుతుందని భావిస్తున్నారు. 


logo