సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 21, 2020 , 23:35:21

మంచులింగం.. పులకించిన భక్త జనం

మంచులింగం.. పులకించిన భక్త జనం

సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్నది. మహాశివరాత్రి పురస్కరించుకొని సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి శివరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించింది. అందుకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం వేదికైంది. వేలాది కిలో మీటర్ల దూరంలో కొలువైన మంచు లింగాన్ని సిద్దిపేటలో అబ్బురపడే సెట్టింగ్‌లతో ఏర్పాటు చేయడంతో భక్తులు మధురానుభూతిని పొందారు. ఓంకార నాదం, శివనామస్మరణలతో సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం మార్మోగింది. తెల్లవారు జాము నుంచే అమర్‌నాథుని మంచులింగ సహిత ద్వాదశ  జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులు, ప్రజలు పోటెత్తారు. కాగా, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని అమర్‌నాథుని మంచులింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆయన ప్రత్యేకంగా దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు. 


logo