శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 21, 2020 , 05:52:08

ప్రేమ పగగా మారి..

ప్రేమ పగగా మారి..

గజ్వేల్‌ టౌన్‌: గజ్వేల్‌ పట్టణంలో బ్యాంకు ఉద్యోగి ని హత్య చేసి సంచలనం సృష్టించిన కే సుకు కారణమైన నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. గురువారం గజ్వేల్‌ పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎ ల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన లక్ష్మీరాజ్యం, మణెమ్మ దంపతుల కూతురు దివ్య  5 నెలల నుంచి గజ్వేల్‌ ఏపీజీవీబీ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నది. దివ్య, వేములవా డ పట్టణానికి చెందిన వెంకటేశ్‌ ఇద్దరు కలిసి 9, 10వ తరగతి ఒకే స్కూల్లో చదువుకున్నా రు. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దివ్య బ్యాంక్‌, కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్‌ అవుతున్న సమయంలో ఆమెను ప్రేమిస్తున్నాని పెండ్లి చేసుకుందామని వెంటపడ్డాడు. ఇంతలో దివ్యకు ఉద్యోగం రావడంతో గజ్వేల్‌కు వచ్చింది. అప్పటి నుంచి దివ్య వెంకటేశ్‌ను దూరం పెడుతుండడంతో వెంకటేశ్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.  ఇదే సమయంలో దివ్య వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందని వెంకటేశ్‌కు తెలిసింది. నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదని దివ్యను చంపాలని వెంకటేశ్‌ నిర్ణయించుకున్నాడు.


పథకం ప్రకారమే హత్య..

దివ్యను చంపాలనుకున్న వెంకటేశ్‌ గజ్వేల్‌ బ్యాంకు వద్దకు, ఆమె ఉంటున్న ఇంటి వద్దకు గత కొంత కాలం నుంచి పలుమార్లు వచ్చి వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన రాత్రి సుమారు 7.45 గంటల సమయంలో దివ్య బ్యాంకు నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న విషయాన్ని గమనించాడు. ఇంట్లో దివ్య తల్లిదండ్రులు లేని సమయాన్ని ఎంచుకున్నాడు. డాబాపై ఆరవేసిన బట్టలు దివ్య తీస్తుండగా నిందితుడు వెంకటేశ్‌ దివ్య వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న కత్తిని తీసి దివ్య గొంతుపై, ఇతర భాగాలపై పొడిచి హత్య చేశాడు. అయితే తమ కూతురిని వేములవాడ పట్టణానికి చెందిన వెంకటేశ్‌ కొంత కాలంగా ప్రేమిస్తున్నాని వేధిస్తున్నాడని అతనే హత్య చేసి ఉంటాడనే అనుమానం ఉందని దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట ఇన్‌చార్జి సీపీ శ్వేత కేసు దర్యాప్తు కోసం గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 5 స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. దివ్యను హత్య చేసిన అనంతరం నిందితుడు వెంకటేశ్‌ గజ్వేల్‌ నుంచి నేరుగా సికింద్రాబాద్‌ నుంచి రైలులో విజయవాడకు, అక్కడ నుంచి వరంగల్‌ మీదుగా వేములవాడకు చేరుకున్నాడు. బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలో స్పెషల్‌ టీమ్స్‌ అధికారులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తనే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు వెంకటేశ్‌ను గురువారం జుడిషియల్‌ రిమాండ్‌కు పంపించడంతో పాటు కఠిన శిక్ష పడడం కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సిద్దిపేట ఇన్‌చార్జి సీపీ శ్వేత తెలిపారు. 24 గంటల్లో కేసు చేధించిన గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు, సీఐ మధుసూదన్‌రెడ్డిలతో పాటు సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు.


logo