బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 20, 2020 , 01:33:44

జీవన ప్రమాణాలు పెరుగాలి

జీవన ప్రమాణాలు పెరుగాలి

దుబ్బాక టౌన్‌ : రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, ముఖ్యంగా పట్టణాల్లో సమూలంగా మార్పులు చేస్తూ ప్రజలు ప్రపంచంతో పోటీపడే వి ధంగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు లక్ష్యమని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ వనితాభూంరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితోపాటు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మె ల్యే సోలిపేట రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పట్టణ ప్రగతి పై కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. 


పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పట్టుదల, అతివిశ్వాసంతో చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నూతన మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టాలు రూపొందించబడ్డాయని, వాటి తో ప్రజల జీవన ప్రమాణాల్లో పెను మార్పులు వస్తాయని తెలిపారు. సమస్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో చట్టాల ను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పట్టణ ప్రగతి ఈ నెల 24 నుంచి పది రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతలోగా వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా ప్రణాళిక లను రూపకల్పన చేసుకోవాలని కౌన్సిలర్లను కోరారు.  ప్రతి వార్డుకు ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు. 

 

పట్టణ ప్రణాళికలో మున్సిపల్‌ కమిషనర్ల పాత్ర కీలకమని, వారం రోజులపాటు ఉదయం 5:30 నుంచి 10:30 గంటలకు వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. అధికారులు వార్డుల్లో, గ్రామాల్లో నిద్రించాలని, సామాజిక బాధ్యతతో వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యానికి చేరుకోవాలన్నారు. పట్టణప్రణాళికలో దుబ్బాక మున్సిపాలిటీకి రూ.20 లక్షలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేశానికే తెలంగాణ పట్టణా లు, పల్లెలు ఆదర్శం కావాలన్న సీఎం ఆకాంక్షను నేరవేర్చే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి, అధికారిపై ఉందన్నారు. 

  ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ..     సీఎం కేసీఆర్‌ నిర్ధేశించిన విధంగా పని చేసి దుబ్బాక ము న్సిపాలిటీని జిల్లాలో అగ్రస్థానంలో నిలుపాలని కౌన్సిలర్ల కు పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమాజానికి రెండు కండ్ల అని.. ఇద్దరు సమన్వయంతో పని చేసి వార్డు సమస్యలను పరిష్కరించాలన్నారు. దుబ్బాకలోనూ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ము జామ్మిల్‌ ఖాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నర్సయ్య, వైస్‌చైర్మన్‌ సుగుణబాలకిషన్‌, కౌన్సిలర్లు రజిత, దేవలక్ష్మి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌, సంధ్యారాణి, కనకయ్య, బాలకృష్ణ, స్వామి, బంగారయ్య, శ్రీజ, యాదమ్మ, సులోచన, యాదగిరి, మీన, దేవుని లలిత, కల్పన, స్వప్న, రాజవ్వ పాల్గొన్నారు. 


 అంకితభావంతో పనిచేయాలి

- హుస్నాబాద్‌ పట్టణాభివృద్ధిపై ప్రణాళిక

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ జీవనశైలిని మార్చేందుకే సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేశారని కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ మున్సిపల్‌లో పట్టణ ప్రగతి సన్నాహక స మావేశం నిర్వహించారు. మెరుగైన పౌరసేవల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి సమస్య లను పరిష్కరించేలా మున్సిపల్‌ చట్టం తెచ్చారన్నారు. వార్డుల వారీగా 60 మందితో కమిటీలు వేసుకొని, వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించడం, సమస్యలను నమోదు చేసి, పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించడం పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి పట్టణంలో 50శాతం సామూహిక సమస్యలుంటే 50 శాతం వ్యక్తిగత సమస్యలు ఉంటాయన్నారు. పట్టణ ప్రగతిలో హుస్నాబాద్‌ పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నర్సరీలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పింఛన్ల పరిస్థితి, మిషన్‌ భగీరథ కనెక్షన్లు, డం పింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, పట్టణ సుందరీకరణకు అవసరమయ్యే నిధులు, విధి విధానాలను ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీతోగా రూపొందించాలని సూచించారు. పట్టణ ప్రగతిపై అధికారులు, కౌన్సిలర్లకు  అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న సిద్దిపేటలో సమావేశం ఉంటుందని, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని కలెక్టర్‌ చెప్పారు.


పట్టణ ప్రగతిలో నిత్యం ఉదయం 5:30 నుంచి 10:30 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డుల్లో ఉండాలని కలెక్టర్‌ సూచించారు. మూడు రోజులు ఒక మున్సిపాలిటీలో అడిషనల్‌ కలెక్టర్‌ పర్యటిస్తారన్నారు. పది రోజులు మున్సిపల్‌ కమిషనర్‌ సమాచారం ఇవ్వాల్సి ఉం టుందన్నారు. రెండు రోజులు ప్రత్యేకాధికారులు విధిగా వార్డుల్లో పర్యటించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజితావెంకన్న, కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, మేనేజర్‌ రామకృష్ణ, కౌన్సిలర్లు కొంకట నిళినీదేవి, బోజు రమరవీందర్‌, బొల్లి కల్పన, గూల్ల రాజు, గోవిందు రవి, వాల సుప్రజ, బొజ్జ హరీశ్‌, పెరుక భాగ్యరెడ్డి, వల్లపు రాజు, పద్మ, రత్న, శ్రీనివాస్‌, వేణు తదితరులు పాల్గొన్నారు. 


నూతన మున్సిపల్‌ చట్టంపై అందరికీ అవగాహన ఉండాలి

చేర్యాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం చేసిన మున్సిపల్‌ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సాయంత్రం ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపరాణి అధ్యక్షతన పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌన్సిలర్లు, అధికారులు ముందుగా  వార్డులో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని సూ చించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు.  కమిషనర్‌, కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు వార్డులను సందర్శించాలని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, అడిషనల్‌ కలెక్టర్‌ మున్సిపాలిటీలను అకస్మికంగా తనిఖీ చేస్తారని తెలిపారు. చేర్యాల పట్టణంలో గతంలో నాటిన మొక్కల్లో 10శాతం కాడా పెరగలేదన్నారు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, కనీస పరిశుభ్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సమిష్టిగా పని చేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  

పట్టణాల సమగ్రాభివృద్ధికి అందరూ సమిష్టిగా పని చేయాలన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజాప్రతినిధులు అవగాహన పెంచుకోవాలన్నారు. పట్టణ సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. గృహ అనుమతులపై కొత్త చట్టం ఎంతగానో ఉపకరిస్తుందన్నా రు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రవణ్‌కుమార్‌, తహసీల్దార్‌ శైలజ, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, పచ్చిమడ్ల సతీశ్‌, మంగోలు చంటి, తమ్మలపల్లి లీల, చెవిటి లింగం, సురేశ్‌, జుబేదాబేగం పాల్గొన్నారు.logo