మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 19, 2020 , 00:04:08

బ్యాంకు ఉద్యోగిని దారుణహత్య

బ్యాంకు ఉద్యోగిని దారుణహత్య

గజ్వేల్‌టౌన్‌ : బ్యాంకు ఉద్యోగిని దారుణహత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో మంగళవారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజ్యం, మణెమ్మ దపంతుల కూతురు దివ్య (26) కొంత కాలంగా స్థానిక ఏపీజీవీబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నది. తల్లిదండ్రులతో కలిసి దివ్య పట్టణంలోని లక్ష్మీప్రసన్నకాలనీలో అద్దె ఇంట్లో నివా సం ఉంటున్నది. కాగా, మంగళవారం సాయం త్రం విధులు ముగించుకొని తన నివాసానికి వెళ్లింది. అయితే, రాత్రి సమయంలో దివ్య ఒంటరిగా ఉండడం చూసి గుర్తు తెలియని వ్యక్తులు  ఇంట్లోకి చొరబడి మెడ కొసి హత్య చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఏసీపీ నారాయణ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌ టీం సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. కాగా, దివ్య వివాహం ఈ నెల చివరి వారంలో జరుగనుందని స్థానికులు తెలిపారు. ఇంతలోనే దివ్య హత్యకు గురవడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో వారంలో వివాహం జరుగాల్సిన అమ్మాయి రక్తపుమడుగులో ఉండడా న్ని చూసి కుటుంబ సభ్యులు రోధించారు. హత్య కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


logo