ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 18, 2020 , 00:46:34

అభివృద్ధి వీక్షణం

అభివృద్ధి వీక్షణం

గజ్వేల్‌ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మంగళవారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌లో వివిధ రంగాల్లో ఊహించని అభివృద్ధిని చేపట్టారు.

  • నేడు గజ్వేల్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు
  • సీఎం సూచనతో అభివృద్ధి పనుల పరిశీలన
  • ఐవోసీ, మార్కెట్‌ సముదాయం, ఎడ్యుకేషన్‌ హబ్‌లలో పర్యటన
  • ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, గడా ఓఎస్డీ

 గజ్వేల్‌, నమస్తే తెలంగాణ/ గజ్వేల్‌టౌన్‌: గజ్వేల్‌ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మంగళవారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌లో వివిధ రంగాల్లో ఊహించని అభివృద్ధిని చేపట్టారు. ఆరేండ్లలో గజ్వేల్‌ అన్ని రంగాల్లో కొత్త మార్పు సంతరించుకోవడంతో పాటు పట్టణ రూపురేఖలే మారిపోయాయి. స్థానికంగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, వైకుంఠధామంతో పాటు ఎడ్యుకేషన్‌హబ్‌, ఆడిటోరియం, అర్బన్‌పార్కు తదితర అభివృద్ధి పనులు అధునాతన సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంటింటికీ మంచినీరు, రోడ్ల విస్తరణ, విద్యా, వైద్యం ప్రజలకు చేరువై అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమం ప్రజలు కోరుకున్నట్లు అందివచ్చింది. చిరకాలవాంచ గజ్వేల్‌కు రైలు సౌకర్యం కూడా త్వరలో అందుబాటులోకి రానుండగా కొండపోచమ్మ రిజర్వాయర్‌తో స్థానిక వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయి. 


ఇంకా పచ్చదనం, పరిశుభ్రత, అడవుల పెంపకంలాంటి పలు సౌకర్యాలు ప్రజలు పొందడమే కాకుండా ప్రయోగాత్మకంగా గజ్వేల్‌లో ప్రారంభమై రాష్ర్టానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. వీటన్నింటిని పరిశీలించడానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు సుమారు 80 మంది ఎమ్మెల్యేలు, 33 మంది జిల్లా కలెక్టర్లు, 50 మంది అదనపు కలెక్టర్లు, 11 మంది మేయర్లు, 141 మంది మున్సిపల్‌ చైర్మన్‌లు, 141 మంది మున్సిపల్‌ కమిషనర్‌లు గజ్వేల్‌ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయి పరిశీలించనున్నారు.


ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌..

గజ్వేల్‌ పర్యటన సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి సోమవారం సాయంత్రం స్థానిక ఏర్పాట్లను పరిశీలించారు. గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మంత్రులు, అధికారుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయన్నారు. logo